అదే నిజమైతే... గుండు కొట్టించుకుని మీ కాళ్లు పట్టుకుంటా: శివాజీ రాజా

By Bojja Kumar

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) నిధులను తాను కాజేసినట్టు వచ్చిన వార్తలపై అధ్యక్షుడు శివాజీరాజా స్పందించారు. తొమ్మిదివందల మంది ఏకగ్రీవంగా తనపై నమ్మకంతో అధ్యుడిగా ఎన్నుకున్నారని, వారికి నమ్మకాన్ని ఒమ్ము చేయలేదు, ఆ ఆరోపణల్లో నిజం లేదు అన్నారు.

నేను ఉండగానే 'మా' బిల్డింగ్ కట్టేస్తానని స్పష్టం చేశారు. ఇరవై ఏళ్ల నుండి నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఉన్నాను. నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత ఐదు పైసలు కూడా మిస్ యూజ్ అవ్వలేదు. నా పిల్లల మీద, పెద్దమ్మతల్లి మీద ఒట్టేసి చెబుతున్నాను. అలా జరిగిందని నిరూపిస్తే గుండు కొట్టించుకుని మీ అందరి కాళ్లు పట్టుకుని వెళ్లిపోతాను అన్నారు.

MAA President Sivaji Raja Gives Clarification On Misusing Funds

కొంతమంది త్వరలో రాబయే 'మా' ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు. వారే ఇటువంటి ప్రచారం చేస్తున్నారు. వారికి మేము బిల్డింగ్ కట్టడం ఇష్టం లేదు. ఎలిగేషన్ చేసే వారు కష్టపడండి ప్రెసిడెంట్ అవ్వండి. వచ్చిన రెండేళ్లకే ప్రెసిడెంట్ అవుతానంటే 900 మంది సభ్యులు మిమ్మల్ని నమ్మాలి కదా... అని వ్యాఖ్యానించారు.

తాను ఒక్క పైసా దుర్వినియోగం చేయలేదు. చేసినట్లు నిరూపిస్తే జీవితంలో ఈ అసోసియేషన్‌కు రాను.. నా ఆస్తి మొత్తాన్నీ రాసిచ్చేసి వెళ్లిపోతాను. ఇది నా ప్రామిస్... నా పిల్లల మీద ఒట్టేసి చెబుతున్నానని శివాజీ రాజా అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X