»   » 'మా' స్టార్ క్రికెట్ ఎప్పుడు..ఎక్కడ?

'మా' స్టార్ క్రికెట్ ఎప్పుడు..ఎక్కడ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) మరోసారి స్టార్ క్రికెట్ నిర్వహించనుంది. జూన్ 13న హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ స్టేడియంలో 'టి20 టాలీవుడ్ ట్రోఫీ' పేరుతో స్టార్ క్రికెట్ ‌ను నిర్వహించనుంది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ జట్లు ఈ కిక్రెట్ మ్యాచ్‌లు ఆడతాయి. ఈ విషయంపై హీరో బాలకృష్ణ మాట్లాడుతూ, 'ఈ మ్యాచ్‌ల్లో పాల్గొనడం సంతోషాన్ని కలిగించే అంశం. ఈ మ్యాచ్‌ లన్నీ ఆషామాషీగా కాకుండా యుద్ధంలా జరుగుతాయి. మే 15న టీమ్స్ సెలక్షన్, మే 30న డ్రస్ లాంచ్ ఉంటాయి' అన్నారు.

ఇక 'మా' అధ్యక్షుడు మురళీమోహన్ తెలియజేస్తూ, 'మా'కు సొంత భవన నిర్మాణం, పేద కళాకారులకు సహాయ పడే ఉద్దేశంతో ఈ స్టార్ క్రికెట్‌ను నిర్వహించనున్నాం. జూన్ 13 ఉదయం 9 గంట నుంచి రాత్రి 11 గంటల వరకు క్రికెట్ మ్యాచ్ ‌లు, వినోదాత్మక కార్యక్రమాలు ఉంటాయి. చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నటీనటులందరూ ఇందులో పాల్గొంటారు. రిథమ్ సంస్థ ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ జరుగుతుంది. ఈ సందర్భంగా స్టేడియంలో యాంటీ పైరసీ రన్ కూడా ఉంటుంది' అన్నారు. ఈ సమావేశంలో సిద్ధార్థ, తరుణ్, సుశాంత్, ఆహుతి ప్రసాద్, శివాజీరాజా, గౌతంరాజు, మహర్షి, రిథమ్ విష్ణు, రవి, శేఖర్ పాల్గొన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu