»   » భారీ రేటుకు "ఎక్స్ ప్రెస్ రాజా" శాటిలైట్ రైట్స్

భారీ రేటుకు "ఎక్స్ ప్రెస్ రాజా" శాటిలైట్ రైట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి సూపర్ హిట్స్ తో దూసుకెళ్తున్న యంగ్ ఎనర్జిటిక్ స్టార్ శ‌ర్వానంద్‌ హీరోగా, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ వంటి తొలి చిత్రంతోనే బంపర్ హట్ అందుకున్న మేర్లపాక గాంధీ దర్శకత్వంలో, సుర‌భి క‌థ‌నాయిక‌గా యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ఎక్స్ ప్రెస్ రాజా'.

ఈ సారి సంక్రాంతి రేసులో బాలయ్య ‘డిక్టేటర్', జూ ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో', నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రాలతో పాటు శర్వానంద్ నటించిన ‘ఎక్స్‌ప్రెస్ రాజా' మూవీ కూడా పోటీ పడుతోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ మాటీవీ వారు రూ. 3.25 కోట్లకు కొనుగోలు చేసారు. శర్వానంద్ సినిమాలకు మంచి ఆదరణ ఉండటం, సినిమాకు కూడా మొదటి నుండి హైప్ ఉండటంతో ఇంత భారీ రేటుకు మాటీవీ వారు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

Maa TV grabbed Express Raja’s satellite rights

నైజాం ఏరియాలో టాప్ డిస్ట్రిబ్యూటర్ గా కొనసాగుతున్న దిల్ రాజు ఇప్పటికే ‘డిక్టేటర్' రైట్స్ దక్కించుకున్నారు. ‘ఎక్స్ ప్రెస్ రాజా' రైట్స్ కూడా దిల్ రాజు కొనుగోలు చేసారు. తనకు ఉన్న నెట్వర్క్ లో ఈ రెండు చిత్రాలను భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

శ‌ర్వానంద్, సురభి, ఊర్వ హరీష్ ఉత్తమన్, పోసాని కృష్ణ మురళి సూర్య నాగినీడు బ్రహ్మాజి, సుప్రీత్, సప్తగిరి, ప్రభాస్ ను, షకలకశంక‌ర్‌, ధనరాజ్ త‌దిత‌రులు న‌టించారు. ఈ చిత్రానికి మ్యూజిక్ - ప్రవీణ్ లక్కరాజు, సినిమాటోగ్రఫి - కార్తిక్ గట్టమనేని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - సందీప్. ఎన్, ఎడిటర్ - సత్య.జి, ప్రొడక్షన్ డిజైనర్ - ఎస్.రవిందర్, లిరిక్స్ - భాస్కరభట్ల, శ్రీమణి, శ్రీ జో, డ్యాన్స్ - రాజు సుందరం, విశ్వ, రఘు, చీఫ్ కాస్ట్యూమ్ డిజైనర్ - తోట విజయ్ భాస్కర్, ఫైట్స్ - స్టంట్ జాషువా, ప్రొడక్షన్ కంట్రోలర్స్ - ఎమ్. కృష్ణం రాజు (గోపి), మత్తపాటి షణ్ముఖ రావ్, పి.ఆర్.ఓ - ఎస్.కె.ఎన్, ఏలూరు శ్రీను, పబ్లిసిటీ డిజైనర్ - వర్కింగ్ టైటిల్ (శివ కిరణ్), నిర్మాతలు - వంశీ, ప్రమోద్, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ - మేర్లపాక గాంధి.

English summary
Popular entertainment channel Maa TV grabbed Express Raja’s satellite rights for a whopping 3.25 crores.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu