twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మాటీవీ ప్రెస్ రిలీజ్, దాడికి సంబంధించి ఫోటోలు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మాటీవీ కార్యాలయంపై కొందరు టీవీ ఆర్టిస్టులు శుక్రవారం దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాటీవీ ఈ సంఘటనపై ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఇందులో మాటీవీ డైరెక్టర్ సి. రామకృష్ణ మాట్లాడుతూ... ఇన్ని సంవత్సరాలుగా అసంఖ్యాకంగా మాటీవీని ఆదరిస్తున్న ప్రేక్షకులకు, సామాన్య ప్రజలకు ఈ రోజు మాపై జరిగిన దాడిని గురించి వివరణ ఇవ్వాలని భావించి మీ ముందుకొచ్చాం.

    మాటీవీ కార్యాలయంపై జరిగిన దాడిని మాటీవీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, సిబ్బంది తీవ్రంగా ఖండిస్తున్నాయి. ప్రేక్షకులకు వినోదం అందించడమే మా లక్ష్యం. ఈ ప్రయత్నంలో మా విధులకు ఆటంకం కలిగించి హింసకు పాల్పడే పద్దతులను మా ఖండిస్తోందన్నారు.

    ఈ రోజు జరిగిన దాడిలో ఒక సెక్యూరిటీ గార్డు గాయపడ్డాడు. అతన్ని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స ఇప్పిస్తున్నాం. మా రిసెప్షనిస్ట్, మా ఆడిటర్ తృటిలో పెద్ద ప్రమాదం తప్పించుకున్నారు. ఇలాంటి హింసని మేం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించం. ఈ హింసని ఖండిస్తూ మా ఉద్యోగులందరూ కొద్ది నిమిషాలు శాంతియుతంగా మౌనం పాటించారు. ఈ దాడికి కారణమైన డబ్బింగ్ సీరియళ్ల విషయం గురించి వివరణ ఇవ్వాలనుకుంటున్నాం.

    మిగతా వివరాలు, దాడి జరిగిన ఫోటోలు స్లైడ్ షోలో....

    మాటీవీ ప్రెస్ రిలీజ్, దాడికి సంబంధించి ఫోటోలు

    మేం పూర్తిగా న్యాయబద్దంగా వ్యాపారాలు చేస్తున్నాం. ఎవరికీ అన్యాయం చేసి గానీ, ఎలాంటి చట్టాలకు వ్యతిరేకంగా కానీ మేం ఎలాంటి వ్యాపారాలు చేయడం లేదు.

    మాటీవీ ప్రెస్ రిలీజ్, దాడికి సంబంధించి ఫోటోలు

    ఇంత మంది మా ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటూ, కొందరి ఉద్యోగాలు తీయాల్సిన పరిస్థితి కల్పించడం మాకు గానీ ఆందోళన కారులకు గానీ న్యాయం కాదు.

    మాటీవీ ప్రెస్ రిలీజ్, దాడికి సంబంధించి ఫోటోలు

    న్యాయం బద్దంగా వ్యాపారం చేస్తున్నప్పుడు ఎవరూ మా వ్యాపారాలలో జోక్యం చేసుకోవడం మేం సహించం.

    మాటీవీ ప్రెస్ రిలీజ్, దాడికి సంబంధించి ఫోటోలు

    ఆందోళనకారులపై మేం పోలీసులకు కంప్లయింట్ ఇచ్చాం. వారు సరైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం.

    మాటీవీ ప్రెస్ రిలీజ్, దాడికి సంబంధించి ఫోటోలు

    తెలుగు సంస్కృతికి మాటీవీ వల్ల నష్టం జరుగుతోందని మా మీద ఉన్న మరో అభియోగం. నిజానికి తెలుగు సంస్కృతిని పరిరక్షించడానికి మా టీవీ చేసినన్ని కార్యక్రమాలు ఏ టీవీ ఛానల్ చేయడలేదని చెపగలమని రామకృష్ణ అన్నారు.

    మాటీవీ ప్రెస్ రిలీజ్, దాడికి సంబంధించి ఫోటోలు

    మాటీవీపై దాడి దృశ్యాలు.

    అల్లు అరవింద్ మాట్లాడుతూ... 'డబ్బింగ్ సీరియళ్ల వల్ల చాలా మంది ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని కొందరు అంటున్నారు. ఆందోళన చేస్తున్నారు. వారితో మా సిబ్బంది చర్చలు జరిపినప్పుడు వెంటనే డబ్బింగ్ సీరియల్స్ ఆపాలని చెప్పారు. ఒక టైమ్ చెప్పి, అప్పటికి డబ్బింగ్ సీరియల్స్ ని ఆపేయడం వీలు కాదు. దశల వారీగా ఒక నిర్ణీత కాలానికి నిలిపివేసే ప్రయత్నం చేస్తామని మా సిబ్బంది చెప్పారు. ఆ ప్రతిపాదనకు వారు అంగీకరించలేదు. అలా ఆపేయాల్సి వస్తే మాటీవీలో ఉన్న ఎన్నో కుటుంబాలకు నష్టం జరుగుతుంది. మాటీవీకీ కూడా కోట్లలో నష్టం జరుగుతుంది. ఛానల్ వెంటనే నష్టాల్లోకి వెళ్తుంది. చాలా మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుంది. మా కుటుంబాలు రోడ్డున పడం మీకిష్టమా? ఆలోచించండి. డబ్బింగ్ సీరియళ్ల వల్ల కొంతమంది నష్టపోతున్నారన్న విషయం మాకూ తెలుసు. కానీ ఇవాళే ఆపేయాలంటే మాత్రం అది సాధ్యపడే విషయం కాదు. మా కార్యక్రమాలను ఆదరిస్తున్న ప్రేక్షకులను సడెన్‌గా నిరాశపరచలేం' అన్నారు.

    English summary
    C Ramakrishna, director, MAA TV, strongly condemned the attacks and said that they are doing business legally and no one has right to abrupt the business of the channel. "Our security guard severely injured in this incident and he is currently being treated in a hospital. The artistes allege that our channel is against the Telugu language. But we actually have been promoting the language through our programming and promoting our culture with various activities," he said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X