For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తప్పుడు కేసుతో ఇబ్బంది పడ్డాం.. ఓ రౌడీ షీటర్ బ్లాక్ మెయిల్.. మాదాల రవి ఆవేదన

  By Rajababu
  |

  అభ్యుదయ చిత్రాలతో ప్రజలను చైతన్య పరిచిన నటుడు మాదాల రంగారావు. విప్లవ కథాంశంతో చిత్రాలను రూపొందించిన ఆయన సంచలన విజయాలను సాధించారు. ప్రస్తుతం ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకొని తండ్రి బాటలో నడుస్తున్నారు మాదాల రవి. తండ్రి మాదాల రంగారావు నిర్మించిన చిత్రాల్లో బాలనటుడిగా కనిపించిన రవి నేను సైతం చిత్రం ద్వారా హీరో అయ్యాడు. తండ్రి అనారోగ్యం కారణంగా సినిమాలకు కాస్త దూరం అయ్యాడు. వచ్చే కొన్ని నెలల్లో మళ్లీ సినిమాలు రూపొందించే ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు మాదాల రవి. ఇటీవల ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఫిల్మీబీట్ రవితో ముచ్చటించారు. తన వ్యక్తిగత, వృత్తికి సంబంధించిన పలు అంశాలను పంచుకొన్నారు. రవి వెల్లడించిన అనేక విషయాలు ఆయన మాటల్లోనే..

  సినిమా రంగంలోకి ప్రవేశం ఎలా జరిగింది?

  సినిమా రంగంలోకి ప్రవేశం ఎలా జరిగింది?

  మాదాల రంగారావు గారి కుమారుడిగా ఎర్రమల్లెలు చిత్రం ద్వారా బాలనటుడిగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాను. తర్వాత స్వరాజ్యం చిత్రంలోనూ ఇతర నాన్నగారి చిత్రాల్లో నటించాను. ఎర్రమల్లెలు చిత్రంలోని ‘నాంపల్లి స్టేషన్ కాడ' అనే పాటలో కనిపించాను. ఇప్పటికి ప్రేక్షకులను ఆ పాట ఎంతగా ఆకట్టుకుంటుందో అందరికీ తెలిసిందే. దాదాపు 20 సంవత్సరాలపాటు టాప్ సాంగ్‌గా నిలిచింది. వందేళ్ల సినీ చరిత్రలో వంద గొప్ప పాటల్లో ఒకటిగా ‘నాంపల్లి స్టేషన్ కాడ' నిలిచింది. ఆ పాటకు అప్పట్లో గాయని శైలజకు ఉత్తమ గాయనిగా నంది అవార్డు దక్కింది. నాకు ఉత్తమ బాలనటుడిగా అవార్డు లు వచ్చాయి.

  మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది?

  మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది?

  నాన్నగారి సినిమాల్లో బాల నటుడిగా నటించాను. ఆ తర్వాత వైద్య విద్యను అభ్యసించడానికి విదేశాలకు వెళ్లాను. రష్యా, యూరోప్ లో జనరల్ ఫిజీషియన్‌గా ఎండీ పూర్తి చేశాను. గ్యాస్ట్రో ఎంట్రాలజీలో డీఎం మరియు సూపర్ స్పెషలిటీ చేశాను. విదేశాలలో స్కాలరషిప్స్ పొందాను. పలు ఫార్మా స్యూటికల్ కంపెనీలకు ఎండీగా పనిచేశాను. రస్తోవ్‌ హాస్పిటల్ లోని గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో చీఫ్‌గా బాధ్యతలను నిర్వహించాను.

  Puri Jagannath daughter reacted over Drugs Rumor on Her Father
  వైద్య రంగం నుంచి సినిమా రంగానికి మళ్లీ ఎందుకు వచ్చారు?

  వైద్య రంగం నుంచి సినిమా రంగానికి మళ్లీ ఎందుకు వచ్చారు?

  చిన్నప్పటి నుంచి ప్రజా నాట్య మండలి మరియు నాన్నగారి సినిమాల ప్రభావం నాపై ఉంది. కళ కళ కోసం.. ప్రజల కోసం అనే భావనతో సినిమాల్లోకి మళ్లీ వచ్చాను. అభ్యుదయ చిత్రాలను కొనసాగించాలనే ఆసక్తి ఉంది. అందుకే విదేశాల నుంచి ఇక్కడి వచ్చాను. ఆపోలో హాస్పిటల్‌లో పనిచేస్తూనే సినిమాలపై దృష్టి పెట్టాను. ఆ క్రమంలోనే ‘నేను సైతం' అనే చిత్రాన్ని నిర్మించి హీరోగా నటించాను. నేను సైతం అని సామాన్యుడు తలచుకొంటే సమాజాన్ని మార్చవచ్చు అనే కథాంశంతో సినిమాను రూపొందించాం. ఆ చిత్రంలో నాన్న మాదాల రంగారావు గారు కీలక పాత్రను పోషించారు. ఆ తర్వాత మా ఇలవేల్పు, బ్రోకర్ 2, పంచముఖి ఇలా 8 చిత్రాల్లో నటించాను.

  నైను సైతం చిత్రం హిందీలో ఇంక్విలాబ్ పేరుతో విడుదలైంది.

  సినిమాకు సినిమాకు మధ్య చాలా గ్యాప్ ఎందుకు?

  సినిమాకు సినిమాకు మధ్య చాలా గ్యాప్ ఎందుకు?

  నాన్నగారు ప్రజా జీవితానికి అంకితం అయ్యారు కాబ్బటి కుటుంబ భాద్యతలు మరియు వ్యాపార వ్యవహారాలకోసం అనేక దేశాలు తిరగడం వలన తర్వాత నాన్నగారి ఆరోగ్యం క్షీణించడం అందుకు ఓ కారణం. నాన్నకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. స్టార్ హాస్పిటల్లో డాక్టర్ గోపిచంద్ గారు చాలా చేశారు. చాలా క్లిష్టమైన ఆపరేషన్‌ను దాదాపు ఆరు గంటలకు పైగా నిర్వహించారు. ఇప్పుడిప్పుడే నాన్నగారు కోలుకొంటున్నారు. త్వరలోనే ఆయన మీడియా ముందుకు వస్తున్నారు. నవంబర్ నుంచి మళ్లీ ప్రొడక్షన్‌ ప్రారంభిస్తాం. కొన్ని బయటి సినిమాలు కూడా ఒప్పుకొన్నాను. స్వంత ప్రొడక్షన్‌ను కూడా ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నాం.

  మీకు లభించిన అవార్డులు..?

  మీకు లభించిన అవార్డులు..?

  నాంపల్లి స్టేషన్ కాడి పాటకు అప్పట్లో గాయని శైలజకు ఉత్తమ గాయనిగా నంది అవార్డు దక్కింది. నాకు ఉత్తమ బాలనటుడిగా అవార్డు లు వచ్చాయి . నేను సైతం సినిమాకు ఉత్తమ తొలి పరిచయం హీరోగా అవార్డు వచ్చింది. విశాల భారతి పురస్కారాన్ని సీఎం రోశయ్య చేతులు మీదుగా అవార్డు అందుకొన్నాను. రాష్ట్రంలో ఎక్కువ మంది పేషెంట్లకు ఉచితంగా సేవ చేసినందుకు కూడా అవార్డు దక్కింది. అనేక హెల్త్ క్యాంపుల్లో పాల్గొంటున్నాను. లెఫ్ట్ పార్టీలు నిర్వహించే హెల్త్ క్యాంపులకు కూడా సేవలందిస్తున్నాను.

  2014లో మీపై నమోదైన కేసును నుంచి ఎలా బయటపడ్డారు?

  2014లో మీపై నమోదైన కేసును నుంచి ఎలా బయటపడ్డారు?

  2014లో ఓ నేర చరిత్ర కలిగిన వ్యక్తి, దాదాపు 30 కేసులు కలిగి ఉన్న ఒక్క రౌడీ షీటర్ నాపై తప్పుడు ఆరోపణలు చేసాడు. కేసు పెట్టి పోలీసులను మిస్ లీడ్ చేసి నన్ను బ్లాక్ మెయిల్ చేయటానికి ప్రయత్నించాడు. నాకు పోలీస్ వారు నోటీసు ఇవ్వకపోయినా నేనే నా భార్య తో వెళ్లి అన్ని ఆధారాలు వారికీ , కోర్టుకి ఇచ్చి అది తప్పుడు కేసు గా అదే రోజునా నిరూపించాను. అదే రోజున నాకు షరతులు లేని బెయిల్ ఇచ్చి నేను ఇంటికి వచ్చినప్పటికి మరుసటి రోజున కొని ప్రముఖ దీన పత్రికలో, వెబ్ సైట్ లో నేను జైలు కి వెళ్ళాను అని ఫాల్స్ న్యూస్ తో అవాస్తవాలు రాసి బాగా ఇబ్బంది కలిగించారు. తర్వాత కొని నెలలలోనే కోర్టు వారికీ అని సాక్షాలు చూపించి కేసు గెలవటం జరిగింది. నేను ఎప్పుడు ఎటువంటి జైలు కి వెళ్ళలేదు .

  కేసు సమయంలో మీ కుటుంబం పడిన బాధ గురించి చెప్పండి?

  కేసు సమయంలో మీ కుటుంబం పడిన బాధ గురించి చెప్పండి?

  నిజానిజాలు తెలియక , కొని పత్రికలో తప్పుడు వార్త వ్రాయటం వలన నేను నా కుటుంబ సభ్యులు చాలా ఇబ్బంది పడ్డాము . ఆదర్శవంతంగా జీవించిన మా పై ఇలాంటి ఆరోపణలు రావటం చాలా భాధ కలిగించింది. మేము జీవితకాలం ఎవరికైన సహాయం చేస్తామే కానీ ఎవరికి చిన్న కీడు తలపెట్టలేదు.

  English summary
  Madala Ravi is son of veteran actor Madala Ranga Rao, Who was a child artist. He played good characters as child artist and gets many awards. By profession Ravi is doctor. Recently Ravi reintruduced as hero in Nenu Saitam. He shared exclusively his personal, and professional things with Filmibeat telugu.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X