»   » రిస్క్ ఎందుకనుకున్నాడేమో...వేరే వారి కథతో

రిస్క్ ఎందుకనుకున్నాడేమో...వేరే వారి కథతో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సాధారణంగా రచయితలు ...దర్శకులుగా చిత్రం చేస్తున్నారంటే...తామే కథ,కథనం రాసుకుని రెడీ అవుతూంటారు. అయితే ఆ నలుగురు, పెళ్లైన కొత్తలో, గుండె ఝల్లుమంది, ప్రవరాఖ్యుడు సినిమాల రచయిత తన తాను తాజాగా డైరక్ట్ చేస్తున్న చిత్రానికి వేరే వారి కథ తీసుకుంటున్నాడు. వివరాల్లోకి వెళితే... ఆది హీరోగా ఓ కొత్త సినిమా తెరకెక్కనుంది. 'పెళ్త్లెన కొత్తలో', 'గుండెఝల్లుమంది' వంటి వైవిధ్యమైన చిత్రాలు తెరకెక్కించిన మదన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. రాజ్‌కుమార్‌.ఎం నిర్మాతగా వ్యవహరిస్తారు.

దర్శకుడు మాట్లాడుతూ "ఆ నలుగురు, పెళ్లైన కొత్తలో, గుండె ఝల్లుమంది, ప్రవరాఖ్యుడు సినిమాల కథలన్నీ నావే. తొలిసారి వేరొకరి కథతో దర్శకత్వం చేయబోతున్నాను. నా అసిస్టెంట్ చెప్పిన కథ నచ్చడంతో ముందుకెళ్తున్నాను. పల్లెటూరు, పట్టణంలో సాగే కథ ఇది. ఆది పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది. హై ఓల్టేజీ కుర్రాడిగా కనిపిస్తాడు. సినిమాపై ప్యాషన్‌తో రాజ్‌కుమార్‌గారు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తప్పకుండా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. 'పెళ్లైన కొత్తలో' తర్వాత అగస్త్య నా సినిమాకు స్వరాలందిస్తున్నారు'' అని చెప్పారు.

Madan ropes in Aadi for his next project

'పెళ్లైన కొత్తలో', 'గుండె ఝల్లుమంది', 'ప్రవరాఖ్యుడు' సినిమాల దర్శకుడు మదన్ తాజాగా ఓ సినిమా కోసం మెగాఫోన్ పట్టుకుంటున్నారు. ఇందులో ఆది హీరోగా నటిస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుమార్ ఎం. నిర్మాతగా పరిచయమవుతున్నారు. ఆర్ కె స్టూడియోస్ పతాకంపై తెరకెక్కనుంది.

నిర్మాత మాట్లాడుతూ "మదన్ దర్శకత్వంలో ఆది హీరోగా మా తొలి చిత్రాన్ని మొదలుపెడుతున్నాం. వచ్చే నెల 28 నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. డిసెంబర్‌లో విడుదల చేస్తాం. కథ, కథనం అందరికీ తప్పకుండా నచ్చుతుంది'' అని అన్నారు.

ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మదన్, కథ,మాటలు: శ్రీనివాస్ గవిరెడ్డి, కెమెరా: సురేందర్ రెడ్డి.టి., సంగీతం: అగస్త్య, కళ: నాగేంద్ర, ఎడిటింగ్: కార్తిక్ శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బి.నాగిరెడ్డి.

English summary
Aadi, busy with two films, has signed yet another film. This film will be directed by Madan. Madan has directed films like Pellaina Kothalo, Pravarakhyudu and Gunde Jhallumandi. “Till now I wrote the stories for all my films, but for this one I am using a story provided by my assistant director Srinivas,” says Madan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu