»   » ‘స్పైడర్’ కోసం కిలికి భాష రైటర్ మదన్ కార్కీ తెలుగు పాట

‘స్పైడర్’ కోసం కిలికి భాష రైటర్ మదన్ కార్కీ తెలుగు పాట

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి సినిమా మొదటి భాగంలో కాలాకేయ మాట్లాడినా కిలికీ భాష కేవలం ఆ సినిమా కోసమే కనుగొన్నారు. ఈ కల్పిత కొండ భాషను కనిపెట్టడంలో ముఖ్య పాత్ర వహించినది తమిళ్ మాటల రచయత - గేయరచయత మధన్ కర్కీ. ఆయన ఇప్పుడు సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలో ఒక పాట రాసే అవకాశం వచ్చింది. ఇప్పుడు సూపర్ స్టార్ కి రాయబోతున్న ఈ పాట తెలుగులో మధన్ రాస్తున్న మొదటి తెలుగు పాట అవ్వడం విశేషం.

వేరే భాషలో పాట రాశాడు

వేరే భాషలో పాట రాశాడు

ఇతర భాషల్లో మాట్లాడటమే కష్టం అలాంటి మదన్ ఏకంగా వేరే భాషలో పాట రాశాడు.మురుగదాస్ దర్శకత్వంతో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న స్పైడర్ సినిమాతో తెలుగును గేయ రచయితగా పరిచయం అవుతున్నాడు మదన్ కార్కీ. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.


Spyder Movie First Song 'Boom Boom'
స్పైడర్ సెప్టెంబర్ 27న

స్పైడర్ సెప్టెంబర్ 27న

ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న స్పైడర్ సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. స్పైడర్ సినిమా షూటింగ్ అంతా పూర్తి అయ్యింది. ఈ సినిమా సెప్టెంబర్ 27న దసరా కానుకుగా రాబోతుంది.


మహేశ్ సినిమాకు పాట

మహేశ్ సినిమాకు పాట

విడుదల తేది కూడా ఒకటి ఫిక్స్ చేసిన తరువాత కొత్తగా ఒక పాట కోసం ఇప్పుడు మధన్ ను అడగడం కొత్త ఆసక్తిరేపింది. మధన్ మాట్లాడుతూ " మహేశ్ సినిమాకు పాట రాసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. డైరెక్టర్ మురుగదాస్ గారికి నా కృతజ్ఞతలు.


రకుల్ ప్రీత్ సింగ్

రకుల్ ప్రీత్ సింగ్

నా పై వాళ్ళ పెట్టుకున్న నమ్మకాన్ని మహేశ్ బాబు పై అభిమానులు పెట్టుకున్న ఆశలను దృష్టిలో పెట్టుకొని పాట రాస్తాను" అని అన్నాడు. ఈ సినిమాలో మహేశ్ బాబు కి జంటగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. ఈ సినిమాలో మరో స్టార్ డైరెక్టర్ యెస్.జె. సూర్య ప్రతినాయకుడు గా నటిస్తున్నాడు. స్పైడర్ సినిమాకు సంగీతం హరీష్ జయ రాజ్ సమకూరుస్తున్నాడు.


English summary
"Penned my first Telugu song for ‘Spyder'. Big thanks to director A.R Murugadoss and Harris Jayaraj for trusting in me," Karky tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu