»   » రామ్ చరణ్‌తో చేయడం లేదని తేల్చి చెప్పాడు!

రామ్ చరణ్‌తో చేయడం లేదని తేల్చి చెప్పాడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళంలో సూపర్ హిట్టయిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ‘థాని ఓరువన్' చిత్రాన్ని తెలుగులో రామ్ చరణ్ హీరోగా రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. అయితే ఈ చిత్రంలో అత్యంత కీలకమైన విలన్ పాత్రలో ఎవరు నటిస్తున్నారనేది హాట్ టాపిక్ అయింది.

తమిళంలో విలన్ పాత్రలో అరవిందస్వామి నటించారు. తెలుగులో విలన్ పాత్ర కోసం ఇప్పటికే పలువురి పేర్లు వినిపించాయి. తెలుగు స్టార్ నాగార్జున పేరు కూడా వినిపించింది. అయితే నాగార్జున ఈ రోల్ చేయడం లేదని తేలిపోయింది. గత కొంత కాలంగా నటుడు మాధవన్ పేరు ప్రచారంలో ఉంది.

Madhavan tweet about Ram Charan project

మాధవన్ తెలుగు ప్రేక్షకులు లవర్ బాయ్ గానే పరిచయం. ఆయన హీరోగా వచ్చిన రన్, సఖి, చెలి చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. చాలా కాలం తర్వాత మళ్లీ మాధవ్ తెలుగు తెరపై, అందులోనూ పవర్ ఫుల్ విలన్ పాత్రలో, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో సినిమాలో కనిపిస్తున్నాడనే వార్తలు ఆసక్తిని రేకెత్తించాయి.

అయితే.... ఈ వార్తల నేపథ్యంలో మాధవన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. తాను ప్రస్తుతం ‘సాల ఖాదూస్', ‘ఇర్రుది సత్రు' సినిమాల్లో నటిస్తున్నాను. ఇవి తప్ప ఏ లాంగ్వేజ్ లోనూ, మరే సినిమాకు కూడా కమిట్ కాలేదు అని ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు.


రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించబోతున్నట్లు సమాచారం. ‘థాని ఓరువన్' చిత్రం రీమేక్ రైట్స్ భారీగా ధరకు కొనుగోలు చేసారు. తమిళంలో ఈ చిత్రం జయం రవి, నయనతార, అరవింద స్వామి ప్రధాన పాత్రల్లో ఎం.రాజా దర్శకత్వంలో తెరకెక్కింది.

English summary
‘Hey Folks.This being a verified site I shall personally tell you about the projects I have signed and doing.The rest are all rumours. I have not signed nor approved any other project in any language. Right now my life is only Saala Khadoos and Irrudhi Suttru.’ Madhavan tweeted.
Please Wait while comments are loading...