twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పదవులు అలా వస్తాయి .. ఎందులోనైనా అలాగే.. మాధవీలత సెన్సేషనల్ కామెంట్స్

    |

    మాధవీలతా, సాధినేని యామినేని మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. సాధినినే యామిని బీజేపీలో చేరడంపై మాధవీలతా తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించింది. ఈ మేరకు ఆమెను ధూషిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేసింది. అయితే ఈ వివాదంలోకి శ్రీ రెడ్డి ఎంటరై సాధినేనికి మద్దతించింది. దాంతో శ్రీ రెడ్డి వర్సెస్ మాధవీలతగా వార్ నడిచింది. ఇరువురు ఒకరిపై ఒకరు సైటైర్స్ వేసుకుంటూ వచ్చారు. తాజాగా సాధినేని యామిని ఓ పదవిని కట్టబెట్టడంపై సెటైర్స్ వేసింది.

    సాధినేని యామినిపై ఫైర్

    సాధినేని యామినిపై ఫైర్

    సాధినేని యామిని టీడీపీ నుంచి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆమెను టార్గెట్ చేస్తూ మాధవీలతా ఫైర్ అయింది. మల్లెపూల వాసనలు గురించి ఇష్టం వచ్చినట్లుగా అబద్ధాలు చెప్పే వారికి, మల్లెపూలు నలిపిన కథలు బాగా తెలిసిన వారికి పదవులు ఇస్తారా.. అంటూ మాధవీలతా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది.

    శ్రీ రెడ్డి వర్సెస్ మాధవీలత..

    శ్రీ రెడ్డి వర్సెస్ మాధవీలత..

    సాధినేని యామినిపై కామెంట్స్ చేసిన మాధవీలతాపై శ్రీరెడ్డి రెచ్చిపోయింది. తాటతీస్తా.. హిస్టరీ బయట పెట్టాల్సి వస్తుందని శ్రీరెడ్డి హెచ్చరించగా.. మాధవీలత సైతం ధీటుగా కౌంటర్ వేసింది. ఇలా వారిద్దరి మధ్య నిత్యం ఏదో ఒక మాటల యుద్దం నడుస్తూనే ఉంటుంది.

    సాధినేనికి పదవి..

    సాధినేనికి పదవి..

    సాధినేని యామినిని వారణాశి కాశీ దేవస్థాన బోర్డ్‌లో దక్షిణాది తరుపున అధికార ప్రతినిధి గా నియమించారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ఓ నెటిజన్ ప్రస్థావించాడు. ఇన్నాళ్లు పార్టీలో ఉన్న మాధవీలతను గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మాధవీలత స్పందించింది.

    అలాంటి వారు లేరు..

    అలాంటి వారు లేరు..

    ఇండియాలో పదవులు రావాలంటే టాలెంట్ అక్కర్లేదు.. రికమండేషన్స్ ఉంటే చాటు.. గొప్ప వాళ్లతో పరిచయాలు చాలు..పాలిటిక్స్ అనే కాదని ఎందులోనైనా రికమండేషన్స్ ఉంటాయని, తనకు ఎవ్వరూ గొప్పవాళ్లు ఎవ్వరూ లేరు రికమండ్ చేయడానికి, అభిమానులు తప్పా.. అని నెటిజన్లకు సమాధనం ఇచ్చింది. ఆలస్యమైన దేవుడు మంచి చేస్తాడని తెలిపింది.

    English summary
    Madhavi Latha Comments On Appointment Of Sadineni Yamini. Sadineni Yamini Appointed as varanasi kasi board member.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X