»   » నేను నోరు విప్పితె ఇండస్ట్రీ లో కాపురాలు కూలిపోతాయ్: మాధవీలత

నేను నోరు విప్పితె ఇండస్ట్రీ లో కాపురాలు కూలిపోతాయ్: మాధవీలత

Posted By:
Subscribe to Filmibeat Telugu

నచ్చావులే, స్నేహితుడా వంటి సినిమాల్లో హీరోయిన్‌గా కనిపించిన మాధవీలత గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. చిన్న సినిమాల్లో కనిపించి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నప్పటికీ అప్పట్లో మాధవీలతకు ఆఫర్లు అంతగా రాలేదు. దీంతో తమిళ మూవీస్‌లో ట్రై చేసినా అక్కడా సక్సెస్ కాలేదు. అలా హీరోయిన్‌గా ఫేడవుట్ అయిన మాధవి, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటూ బోలెడు ఫాలోవర్లను సంపాదించుకుంది. కర్ణాటకలో పుట్టి పెరిగిన మాధవీ లత మొదటి సినిమాతోనే మంచి టాలెంట్ కలిగిన నటి అని గుర్తింపు తెచ్చుకుంది. అయితే అంత టాలెంట్ ఉండి అయిదారు సినిమాలకే కనిపించకుండా పోయింది.

"నచ్చావులే' సినిమా తర్వాత నానితో కలిసి 'స్నేహితుడా' సినిమాలో మెరిసిన మాధవీలత తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసినా కూడా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. దాంతో దాదాపుగా సినిమాలకు దూరం అయిపోయింది. ఇకపోతే, రీసెంట్ గా ఓ షార్ట్ ఫిలింలో నటించి అలరించిన మాధవీలత.. ఫేస్ బుక్ లో మాత్రం అభిమానులను సంపాదించుకుని బాగానే సందడి చేస్తోంది. ఇదంతా పక్కన పెడితే అసలు తాను వెండితెరకు ఎందుకు దూరం కావాల్సి వచ్చిందో ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.

Madhavi Latha Reveals Her Shocking Harassment

ఆమె ఇండస్ట్రీ లో ఎవరికీ లొంగకపోవడం వల్లే ఆమెకి ఈ పరిస్థితి వచ్చిందట. ఇండస్ట్రీ లో పెద్ద మనుషులుగా చలామణీ అవుతున్న చాలమంది హీరోయిన్స్ విషయంలో మాత్రం సెక్సువల్ రిలేషన్ కే ప్రాధాన్యత ఇస్తారు అనేలా మాట్లాడింది. నేను కనుక నోరు విప్పితే ఎంతమంది కాపురాలు కూలిపోతాయంటూ హెచ్చరించింది. దాదాపు ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది సిట్యుయేషన్ ఇదే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

అలాగే తన లవ్ స్టోరీ గురించి, పెళ్లి పై తన ఒపీనియన్ గురించి చెప్పుకొచ్చింది. ఒక ప్రొడ్యూసర్ ఆమె నో చెప్పినందుకు తనను ఎలా హెరాస్ చేసాడో వివరించింది. లొకేషన్ లో అందరిముందు అరిచేవాడని, ఒకసారి సాంగ్ షూటింగ్ కోసం షార్ట్ డ్రెస్ వేసుకోమంటే వేసుకోకపోవడంతో పెద్ద గొడవ జరిగిందని, ఇంకా తాను ఎదుర్కొన్న ఎన్నో చేదు విషయాలు, వాటి వెనుక ఉన్న కఠిన వాస్తవాలను ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్ ప్రోగ్రాం లో రివీల్ చేసింది. ఈ ఎపిసోడ్ ప్రోమో ఆల్రెడీ ఇండస్ట్రీ లో సంచలనం క్రియేట్ చేస్తుంది. ఈ సెన్సేషనల్ ఇంటర్వ్యూ ఈ శుక్రవారం నుండి ఐ డ్రీం మూవీస్ లో అందుబాటులో ఉంటుందట.

English summary
Tollywood Actress Madhavi Latha Who Reveals Her Shocking Harassments In Frankly With TNR
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu