For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కత్తి చికెన్స్ అదుర్స్.. మధుప్రియ ఔట్.. అడుగుపెట్టేది అనసూయేనా?

  By Rajababu
  |

  బిగ్‌బాస్‌ హౌస్‌లో రెండో వారానికి సంబంధించిన సమీక్షను హోస్ట్ జూనియర్ ఎన్టీఆర్ నిర్వహించారు. వారంపాటు జరిగిన విషయాలను పూసగుచ్చినట్టు యంగ్ టైగర్ వివరించారు. ఈ సమీక్షలో బిగ్‌బాస్ హౌస్‌లో ఉత్తమ విలన్ ఎవరు? కత్తి మహేశ్ వండిన చికెన్, మధుప్రియ ఎలిమినేషన్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ప్రవేశిస్తున్న గెస్ట్ ఎవరు అనే అంశాలు ప్రధానంగా నిలిచాయి.

  ఇంటి సభ్యుల గుట్టురట్టు

  ఇంటి సభ్యుల గుట్టురట్టు

  బిగ్‌బాస్ హాలులో సభ్యులందరిని కూర్చోబెట్టి ప్రతీ ఒక్కరి గురించి.. వారంపాటు వారు చేసిన అల్లరిని అడగడమే కాకుండా వారు చేసిన సరదా పనులను కూడా బయటపెట్టాడు ఎన్టీఆర్. కాఫీ పౌడర్ దాచిన ముమైత్‌ను, చక్కెర దాచిన ధన్‌రాజుల విషయాలను బయటపెట్టి బిగ్‌బాస్ చూపు నుంచి తప్పించుకోలేరని చెప్పారు.

  Bigg Boss Telugu : Bigg Boss given Warning to Contestants
  కల్పన ఉత్తమ విలన్

  కల్పన ఉత్తమ విలన్

  బిగ్‌బాస్ హౌస్‌లో విలన్‌ ఎవరు అనే విషయాన్ని ఇంటి సభ్యులను అడిగి తెలుసుకొన్నారు. ఐదుగురు సెలబ్రిటీలు కల్పనను ఉత్తమ విలన్‌గా పేర్కొనగా, సమీర్ విలన్ అని ముగ్గురు, శివ బాలజీ, ధన్‌రాజ్‌ను ఒక్కరు నామినేట్ చేశారు. కెప్టెన్‌గా కాకముందు ఒకరకంగా.. కెప్టెన్ అయిన తర్వాత మరో రకంగా కల్పన వ్యవహరించారు. ఆమె ఓ స్ల్పిట్ పర్సనాలిటీ అనే ఆరోపించారు. వాటిని చాలా ఓపిగ్గా వింటూ కల్పన ఉండటం గమనార్హం.

  మహేశ్‌కు వంట చేసే టాస్క్

  మహేశ్‌కు వంట చేసే టాస్క్

  బిగ్‌బాస్ ఇంట్లోకి వచ్చే ముందు మహేశ్ కత్తి చికెన్ బాగా చేస్తానని చెప్పాడు. కానీ కనీసం వంట కూడా వండలేదు అని ఎన్టీఆర్ అన్నారు. అంతేకాకుండా చికెన్, అల్ల వెల్లులి ముద్దను మహేశ్ కత్తికి ఇచ్చి వంట చేయమని అన్నారు. మహేశ్ కత్తి చికెన్ వండిన తర్వాత ఎన్టీఆర్ వద్దకు పంపించగా గుటకలు వేస్తు తిన్నారు.

  బొంగు చికెన్‌ను మించిన కత్తి చికెన్

  బొంగు చికెన్‌ను మించిన కత్తి చికెన్

  మహేశ్ కత్తి వండిన చికెన్ తింటూ.. ఇది కత్తి చికెన్ అని అన్నారు. బొంగుల చికెన్ తిన్నాను. ఇప్పుడు కత్తి చికెన్ కూడా తిన్నాను. గత కొన్నిరోజులుగా పూణె పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌లో ఉన్నాను. ఇంటిని వండిన తర్వాత రుచి తగలక నాలిక చప్పపడింది. కత్తి మహేశ్ తన చికెన్ మళ్లీ దానిని నిద్రలేపాడు అని ఎన్టీఆర్ అనడం సభ్యులు చప్పట్లతో ప్రశంసించారు.

  మధుప్రియ ఔట్

  మధుప్రియ ఔట్

  ఇక ఎలిమినేషన్ ప్రక్రియలో ఉన్న మధుప్రియ, సమీర్, ప్రిన్స్‌ పేర్లను చదివాడు. కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నందున ప్రిన్స్ ఎలిమినేషన్ ప్రక్రియ నుంచి తప్పించారు. ఆ తర్వాత సమీర్ సేఫ్ జోన్‌లో ఉన్నట్టు ప్రకటించారు. వీక్షకుల ఓటింగ్ మేరకు మధుప్రియ‌ను ఎలిమినేట్ చేస్తున్నట్టు ఎన్టీఆర్ ప్రకటించారు.

  ఆదివారం మధుప్రియను

  ఆదివారం మధుప్రియను

  బిగ్‌బాస్ షోలో ఆదివారం మధుప్రియను జూనియర్ ఎన్టీఆర్ బోను ఎక్కించనున్నారు. యంగ్ టైగర్ ద్వారా బిగ్‌బాస్ అడిగే ప్రశ్నలకు ఆమెతో సమాధానం చెప్పిస్తారు. ఈ షోలో మధుప్రియకు శుక్రవారం చివరి రోజుగా మారింది. ఎలిమినేషన్ చేయగానే ఆమెను లగేజ్‌ను ప్యాక్ చేసుకోవాలని ఎన్టీఆర్ సూచించడం గమనార్హం.

  వైల్డ్‌కార్డు ద్వారా హాట్ ఫిగర్

  వైల్డ్‌కార్డు ద్వారా హాట్ ఫిగర్

  ఇక బిగ్‌బాస్ మొదలనప్పటి నుంచి వైల్డ్ కార్డు ద్వారా ఇంట్లోకి కొత్త సభ్యులు వస్తున్నారంటూ ప్రచారం జరుగుతున్నది. జరిగిన ప్రచారానికి అనుగుణంగానే ఇంటిలోకి హాట్ హాట్‌గా ఉన్న అందాల భామ ప్రవేశిస్తున్నట్టు ప్రోమోలో చూపించి ఆసక్తిరేపారు. వచ్చేది అనసూయ అని ప్రచారం జరుగుతోంది. అయితే అనసూయ తాను రావడం లేదని ఇప్పటికే స్పష్టం చేసింది. యాంకర్ రష్మి కూడా కాకపోవచ్చని అంటున్నారు. టాలీవుడ్ హాట్ ఐటం గర్ల్ హంసా నందిని వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. హీరోయిన్ చార్మిని కూాడా తీసుకొచ్చేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

  English summary
  Telugu Version of Bigboss started with High Energy. But it is going so so affair. Three members out from biggboss in two weeks. Already Sampoo gone out on last Tuesday volunterly. Jyothy was joined the first contestant in elimaned list. Now Madhu Priya eleminated from House for second week.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X