»   » తెలుగు హాట్ బ్యూటీ మధు శాలిని ‘రక్తం’

తెలుగు హాట్ బ్యూటీ మధు శాలిని ‘రక్తం’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు బ్యూటీ మధు శాలిని ఇప్పటి వరకు సినిమాల్లో చేసిన పాత్రలన్నీ దాదాపుగా హాట్ ఇమేజ్ ఉన్నవే. అయితే త్వరలో ఆమె ఓ భిన్నమైన క్యారెక్టరైజేషన్‌‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తొలిసారిగా ఓ నక్సలైట్ పాత్రలో కనిపించబోతోంది.

యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న 'రక్తం' సినిమాలో ఆమె మావోయిస్ట్ పాత్ర పోషిస్తోంది. నా బంగారు తల్లి లాంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమా తీసిన డైరెక్టర్ రాజేశ్ టచ్రివర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఫస్ట్ లుక్ ఇదే..

ఫస్ట్ లుక్ ఇదే..

రక్తం సినిమాకు సంబంధించి మధుశాలిని ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైంది. సినిమాలో మధు షాలిని ఒక ప్రధాన పాత్రలో కనిపిస్తుందని, ఒక అమ్మాయి నక్సలైట్ గా ఎలా మారిందనే కోణంలో సినిమా సాగుతుందని తెలుస్తోంది.

మధ్యతరగతి అమ్మాయి నక్సలైట్ ఉద్యమం వైపు

బాగా చదువుకొని గోల్డ్ మెడల్ సాధించిన ఓ మామూలు మధ్యతరగతి అమ్మాయి నక్సలైట్ ఉద్యమం వైపు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, మావోయిస్ట్ గా మారేందుకు ఆమెను ప్రేరేపించి పరిణామాలేమిటి? ఆసక్తికరంగా ఉంటాయని తెలుస్తోంది.

మధు శాలిని గ్రౌండ్ వర్క్

మధు శాలిని గ్రౌండ్ వర్క్

ఈ సినిమాలోని పాత్ర కోసం మధు శాలిని చాలా గ్రౌండ్ వర్క్ చేసిందట. నక్సలైట్ సిద్ధాంతాలు స్టైడీ చేసిందట. వాళ్ల బాడీ లాంగ్వేజ్, వ్యవహార శైలి తెరపై ప్రతిబింబించేందుకు చాలా ప్రాక్టీస్ చేసిందట. అడవిలో పోరాటాలు, పరుగెత్తడం లాంటివి ఉంటాయి కాబట్టి ఫిజికల్ ఫిట్ నెస్ ట్రైనింగ్ తీసుకుందట.

లెస్ జూస్తెస్

లెస్ జూస్తెస్

‘లెస్ జూస్తెస్' అనే ఫ్రెంచ్ నాటిక ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమాలో కొన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ కూడా ఉంటాయని అంటున్నారు.

English summary
Madhu Shalini has revealed that she will be next seen playing a maoist in National Award winning director Rajesh Touchriver's new film "Raktham". Elaborating more about her character, she revealed that she plays the role of a young and naive village girl, who turns into a naxalite from a gold medal winning student. Her look will be quite natural in this film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu