»   » ఉదయభాను సినిమాపై వివి వినాయక్, కోడి కామెంట్!

ఉదయభాను సినిమాపై వివి వినాయక్, కోడి కామెంట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పాపులర్ యాంకర్ ఉదయభాను తొలిసారిగా హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం 'మధుమతి'. ఉదయభాను ప్రధాన పాత్రలో గోమాతాఆర్ట్స్ పతాకంపై కడియం రమేష్ సమర్పణలో రాణీ శ్రీధర్ 'మధుమతి' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈచిత్ర విడుదల తేదీ ఖరారైంది. డిసెంబర్ 13న సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ సినిమా ప్రీమియర్ షోను ఇటీవల సినీ ప్రముఖుల కోసం ఏర్పాటు చేసామని, దర్శకుడు వివి వినాయక్ సినిమా చూసి బాగుందని మెచ్చుకున్నారని, క్లైమాక్స్ హైలెట్‌గా ఉందని చెప్పారని.... నిర్మాతలు తెలిపారు. అదే విధంగా ప్రముఖ నిర్మాత కోడి రామకృష్ణ మాట్లాడుతూ...ఇటువంటి లేడీపై సబ్జెక్టు డీల్ చేయడం చాలా కష్టం, డైరెక్టర్ రాజా శ్రీధర్ చాలా బాగా అనుభవం ఉన్న డైరెక్టర్ మాదిరి దీనిని డైరెక్ట్ చేసాడు, స్త్రీలపై తీసిన సినిమా ఎప్పుడూ సక్సెస్సే, చక్కని మలుపులతో హాస్యం మేళవించిన ఉన్న ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని చెప్పినట్లు... నిర్మాతలు వెల్లడించారు.

Udaya Bhanu

మధుమతి చిత్రంలో టైటిల్ రోల్ చేస్తున్న ఉదయభాను ఈ చిత్రంలో సెక్స్ వర్కర్‌గా కనిపించబోతోంది. ఈ చిత్రంలో దీక్షాపంథ్, విష్ణు ప్రియన్, సీతా, ప్రభాస్ శ్రీను ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని కడియం రమేష్, కె. రాణి శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మధుమతి సినిమా గురించి దర్శకుడు రాజ్ శ్రీధర్ మాట్లాడుతూ...'నేను ఉదయభాను‌కు సరిపోమే కథని 8 సంవత్సరాల క్రితమే తయారు చేసుకోవడం జరిగింది. విచ్చలవిడిగా తిరిగే ఒక తెలుగు అమ్మాయిని అనుకోని పరిస్థితులో తమిళ అబ్బాయి తన ఇంటికి తీసుకెళ్ళడంతో ఎదురయ్యే పరిణామాలు‌ను తనకి అనుగుణం ఎలా మలుచుకున్నాడు అన్నది ఈ చిత్ర కథ. ఈ సినిమా పూర్తి హాస్యభరితంగా, కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రంగా సినిమా ఉంటుంది' అన్నారు.

సమర్పకులు కడియ రమేష్ మాట్లాడుతూ...అండర్ వాటర్లో తీసిన సీన్లు చాలా బాగా వచ్చాయి. ఉదయభాను ఎంతో ధైర్యంగా ఈ సీన్లు చేసింది. కెమెరామెన్ వి.ప్రభాకర్ ఎంతో అద్భుతమైన పనితనం కనబర్చారు. నటీనటులు, టెక్నీషియన్స్ ఎంతో కష్టపడి పని చేసారని తెలిపారు.

English summary
Anchor turned heroine Udaya Bahu's upcoming film Madhumati is gearing up for release this month 13th. Udaya Bahu essays the role of a sex worker in the film, which also features Diksha, Vishnu Priyan, Seeta and Prabhas Srinu in important roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu