»   » ఆ స్టార్ డైరక్టర్ తో కాంగ్రెసు ఎమ్మల్యే డీల్ ఇప్పుడు అమలులో...

ఆ స్టార్ డైరక్టర్ తో కాంగ్రెసు ఎమ్మల్యే డీల్ ఇప్పుడు అమలులో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆలా మేకర్, ఫేమస్ ఫిల్మ్ మేకర్ ఇద్దరూ చిన్నప్పుడు ఒకే కాలేజీలో చదువుకున్నారు. అప్పుడు కాంటిన్ లో కూర్చుని భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటూ అనుకున్న మాటలు ఇప్పుడు నిజం చేసుకోదలిచారు. వాళ్ళవెరో కాదు. కాంగ్రెసు ఎమ్మల్యే కృష్ణ హెడ్గే, నేషనల్ అవార్డు విన్నర్ మధూర్ బండార్కర్. వాళ్ళిద్దరూ కలిసి మిట్టాబాయ్ కాలేజీలో చదువుకున్నారు. అప్పుడు వారు కాంటిన్ లో కూర్చుని మాట్లాడుకున్నమాటలు ప్రకారం..హెడ్గే ఎమ్మల్యే అయితే మధూర్ తన సినిమాలో వేషం వేయిస్తానన్నాడు. ఇప్పుడు అది నిజం చేయబోతున్నారు. ఇద్దరూ తమ తమ రంగాల్లో ఎంతో ఎత్తుకు ఎదిగి తమ లక్ష్యాలను చేరుకుంటున్న సమయంలో తమ కాలేజీ రోజులని గుర్తుచేసుకుని అప్పటి డీల్ ని అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం మధూర్ బండార్కర్ రూపొందిస్తున్న దిల్ తొ బచాన్ హై జీ చిత్రంలో హెడ్గే తన నిజ జీవిత పాత్ర ఎమ్మల్యేగా చేస్తున్నారు. ఈ విషయమై ఆయన చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇక మధూర్ మాట్లాడుతూ...నేను ఎమ్మల్యే కృష్ణ హేడ్గేని నా చిత్రంలో నటింపచేస్తానని కాలేజీ రోజుల్లో సరగాదా మాట ఇచ్చాను. నేను డైరక్టర్ ని అయ్యా. మాట నిలబెట్టుకునే సమయం వచ్చింది అన్నారు. అదీ సంగతి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu