»   » మధుర్ బండార్కర్ ‘క్యాలెండర్ గర్ల్స్’ ఫస్ట్ లుక్

మధుర్ బండార్కర్ ‘క్యాలెండర్ గర్ల్స్’ ఫస్ట్ లుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : ముంబై: నిజ జీవిత కథల ఆధారంగా సినిమాలు తీయడం బాలీవుడ్ దర్శకుడు మాధుర్ బండార్కర్ స్టైల్. బార్ గర్ల్స్ జీవితంపై 'చాందినీ బార్', మోడలింగ్ రంగంలోని మోడల్స్‌పై 'ఫ్యాషన్', కథానాయికల జీవితంపై 'హీరోయిన్' లాంటి చిత్రాలను ఆయన తెరకెక్కించారు. తాజాగా ఆయన కన్ను క్యాలెండర్ గర్ల్స్‌పై పడింది.

ఈ మధ్య న్యూఇయర్ క్యాలెండర్ల పేరుతో అందమైన భామలకు బికినీ వేయించి ఫోటో షూట్ జరుపడం ఫ్యాషన్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్యాలెండర్ గర్ల్స్ జీవితంపై ఆయన సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తాజాగా సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు.

 Madhur Bhandarkar's 'Calendar Girls' First Look

ఈ సినిమాలోని ఐదుగురు ముఖ్యమైన పాత్రల కోసం ఆరుగు యంగ్ గర్ల్స్‌ను ఎంపిక చేసుకున్నారు. బాలీవుడ్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఇటీవలే ఇందుకు సంబంధించిన ఆడిషన్స్ నిర్వహించినట్లు తెలుస్తోంది. బికినీలకు పర్ పెక్టుగా సూటయ్యే, ఫ్యాషనబుల్ బాడీ ఉన్న అమ్మాయిలను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆగస్టులో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటి వరకు సినిమాలకు పరిచయం లేని కొత్త ముఖాలను ఆయన ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. మాధుర్ బాండర్క్ సినిమా అనగానే సినిమా రంగంలోకి రావాలని ఆశ పడుతున్న మోడల్స్ ఉత్సాహంగా ఆడిషన్స్‌కు హాజరయ్యారు. వారి నుండి మంచి నటనా చాతుర్యం, సెక్సీ బాడీ ఉన్న వారిని ఎంపిక చేసారు.

సినిమాలో ఎక్కడో ఒకసారి స్విమ్‌ సూట్‌ ని హీరోయిన్ వేస్తేనే ఆ సినిమాకు ఓ రేంజిలో క్రేజ్. అలాంటిది. సినిమాలో ఎక్కువ భాగం స్విమ్ సూట్ సీన్ల చుట్టూ తిరిగితే...ఇంకేముంది. ఈ సినిమాలో హాట్ సీన్స్ కూడా ఉంటాయని ప్రచారం జరుగుతోంది.

English summary
Ace filmmaker Madhur Bhandarkar who is known for his award-winning films makes a comeback with 'Calendar Girls' after failing to achieve success with 'Heroine' starring Kareena Kapoor. Today, First Look posters unveiling five debutantes has been released.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu