»   » హాట్ స్విమ్‌ సూట్‌ సీన్లు... ( ‘క్యాలెండర్ గర్ల్స్’ టీజర్)

హాట్ స్విమ్‌ సూట్‌ సీన్లు... ( ‘క్యాలెండర్ గర్ల్స్’ టీజర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మధుర్ భండార్కర్ తన తాజా చిత్రం కేలండర్ గర్ల్స్ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ ని విడుదల చేసారు. గతంలో ఈ పోస్టర్ లో గోల్డ్ కలర్ బికినీ ధరించిన ఐదుగురు భామలు ముఖాలు కనిపించకుండా టోపీలు అడ్డం పెట్టి వదిలారు. దాంతో ఎవరా అందగత్తెలు అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇప్పుడు వీరి ముఖాలు రివిల్ చేసేసారు. అంతేకాదు...వారితో హాట్ భంగిమలతో షూట్ చేసి వదిలాడు. మీరే ఈ టీజర్ చూడండి.

సినిమాలో ఎక్కడో ఒకసారి స్విమ్‌ సూట్‌ ని హీరోయిన్ వేస్తేనే ఆ సినిమాకు ఓ రేంజిలో క్రేజ్. అలాంటిది. సినిమాలో ఎక్కువ భాగం స్విమ్ సూట్ సీన్ల చుట్టూ తిరిగితే...ఇంకేముంది. అలాంటి సినిమా ఒకటి త్వరలో మన ముందుకు రాబోతోంది. అంతేకాదు ఈ సినిమాలో కొన్ని హాట్ సీన్స్ కూడా ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఏమిటా సినిమా అంటే ఈ కథనం చదవాల్సిందే.

మన సమాజంలోని వాస్తవిక పరిస్థితులను తెరకెక్కించే దర్శకుడిగా మధుర్‌ భండార్కర్‌కు మంచి పేరుంది. ప్రస్తుతం ఈయన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా ప్రతి సంవత్సరం రూపొందించే 'కింగ్‌ఫిషర్‌ క్యాలెండర్‌' ఇతివృత్తంగా ఒక చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు హిందీ చిత్రపరిశ్రమలో షికారు చేస్తున్న తాజా వార్త. అయితే ఈ సినిమాలో స్విమ్‌ సూట్‌ సీన్స్ కు ప్రత్యేకమైన క్రేజ్ ఉండబోతోంది.

ప్రతి సంవత్సరం బికినీ భామలతో రూపొందించే ఈ క్యాలెండర్‌కు గ్లామర్‌ ప్రపంచంలో మంచి పేరుంది. స్విమ్‌ సూట్‌ అందగత్తెలతో మలిచే ఈ క్యాలెండర్‌ ద్వారా మాల్యా తన వ్యాపారానికి ప్రచారం చేసుకోవడంతో పాటు ఆ సుందరాంగులకు మెరుగైన మోడలింగ్‌తో పాటు వీరు బాలీవుడ్‌ చిత్రాల్లో నటించే అవకాశాన్ని ఇస్తుంటారు.

Madhur Bhandarkar's Calendar Girls Teaser

విజయ్‌ మాల్యా ఈ కింగ్‌ఫిషర్‌ క్యాలెండర్‌పై మెరిసిన తరువాతే దీపికా పదుకొనె, కత్రినా కైఫ్‌ వంటి హీరోయిన్లు సినిమా అవకాశాలను అందిపుచ్చుకున్నారు. ప్రస్తుతం వారు సినీ వినీలాకాశంలో ఏ స్థాయిలో వెలిగిపోతున్నారో అందరికీ తెలిసిన విషయమే. అందుకే దీనికంతటికీ సూత్రధారి అయిన మాల్యా జీవితం కూడా ఈ చిత్రంలో చోటుచేసుకోవచ్చు.

ప్రస్తుతం ఈ చిత్రం కోసం నటీమణుల వేటలో ఉన్నారట మధుర్‌ భండార్కర్‌. మోడళ్లుగా రాణించి ప్రస్తుతం నటీమణులుగా వెలుగొందుతున్న పలువురు సినీ తారలు ఈ చిత్రంలో నటించవచ్చునని బాలీవుడ్‌ పండితులు భావిస్తున్నారు.

English summary
Madhur Bhandarkar is all ready to bring in his next realistic film, Calendar Girls. First Look Teaser of much-awaited 'Calendar Girls' directed by National Award winning filmmaker Madhur Bhandarkar is finally out. This film is about the life of models in the glamour industry, their ups & downs.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu