»   » పిల్లలు పెరిగారు, మన ఎఫైర్ గురించి వద్దంటూ మాజీ లవర్ రిక్వెస్ట్, దాంతో ఆ సీన్స్ కట్

పిల్లలు పెరిగారు, మన ఎఫైర్ గురించి వద్దంటూ మాజీ లవర్ రిక్వెస్ట్, దాంతో ఆ సీన్స్ కట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సంచలన దర్శకుడు రాజకుమార్‌ హిరాణీ ప్రస్తుతం సంజయదత్‌ బయోపిక్‌ నిర్మాణ సన్నాహాలలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రణబీర్‌కపూర్‌ సంజయదత్‌ పాత్రను పోషిస్తుండగా అతని తండ్రి సునీల్‌ దత్‌ పాత్రను పరేష్‌ రావల్‌ పోషిస్తున్నాడు.

రాజకుమార్‌ హిరాణీ ఈ నిజజీవిత కథను ఆదర్శవంతంగాను, సహజత్వానికి దగ్గరగాను ఉండేలా స్క్రిప్టు తయారు చేసుకున్నాడు. సంజయదత్‌ సమ్మతి లభించాకే సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

అయితే ఈ నిజజీవిత కథ అందాల తార మాధురీ దీక్షిత్‌కు పంటిలో రాయిలా మింగుడు పడటం లేదు. కారణం ఈ బయోపిక్‌లో ఆమె పాత్రకు కూడా స్థానం కల్పించడమే అంటూ వార్తలు వస్తున్నాయి. 90 దశకంలో సాజన్‌ సినిమాలో నటిస్తుండగా సంజయ దత్‌-మాధురీ దీక్షిత్‌ల మధ్య ప్రేమకథ నడిచింది.

Madhuri Dixit love-affair axed from Sanjay Dutt biopic?

అప్పటికే సంజయ్‌కు రిచాశర్మతో పెళ్లయింది. ఒకానొక సందర్భంలో ఇద్దరూ పెళ్లి చేసుకునేందుకు కూడా సిద్ధపడ్డారు. అయితే అనూహ్యంగా అక్రమ ఆయుధాల కేసులో సంజయదత్‌ జైలుకు వెళ్లాల్సి రావడంతో మాధురీ దీక్షిత్‌ సంజయ్‌కు దూరం జరిగింది.

తరవాత లాస్‌ ఏంజెలెస్‌లో హృద్రోగ నిపుణుడు డాక్టరు శ్రీరాం మాధవ్‌ను వివాహం చేసుకొని అమెరికా వెళ్లిపోయింది. ఆమెకు ఇద్దరు కొడుకులు. ఐదేళ్ల క్రితమే మాధురి మరలా తన మకాంను ముంబైకి మార్చింది.

ఇప్పుడు సంజయ్‌ బయోపిక్‌లో మాధురి ప్రేమాయణం గురించి ప్రస్తావిస్తారని మీడియాలో వార్తలు రావటం ఆమెను కలవరపరిచింది. దాంతో మాధురి వెంటనే రియాక్టై సంజయదత్‌ను కలిసి తన పాత్ర ప్రస్తావన రాకుండా చేయమని అర్ధించిది. తన పిల్లలు పెద్దవాళ్లు అయ్యారని, తను ఒకరి భార్యని కాబట్టి అలాంటి అంశాలు ఉంటే బాగుండదని రిక్వెస్ట్ చేసిందిట.

దాంతో సంజయదత్‌ సీన్ లోకి వచ్చి ఆమెకు ఇచ్చిన హామీ ప్రకారం..ఆ సీన్స్ స్క్రిప్టులోంచి తీసేసారట. దాంతో మాధురి రిలీఫ్ ఫీలయైందిట. కాబట్టి ఈ సినిమాలో మాధురి ఎపిసోడ్ చూద్దామని వెళ్తే నిరాశ తప్పదంటున్నారు. ఇప్పటికి మాధురి నాలుగు సార్లు ఫిలింఫేర్‌ వారి ఉత్తమనటి పురస్కారం అందుకోవడమే కాకుండా పద్నాలుగు సార్లు ఫిలింపేర్‌ అవార్డుకు నామినేట్‌ అయింది.

English summary
whoever was expecting the Sanjay-Madhuri love affair to be shown in Sanjaydut biopic film, this film will leave you disappointed.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu