»   » పేరు మార్చుకుని అడల్ట్ సినిమాలో,కలిసొస్తుందా?

పేరు మార్చుకుని అడల్ట్ సినిమాలో,కలిసొస్తుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : సినిమావాళ్లకు సెంటిమెంట్స్ ఎక్కువనే సంగతి తెలిసిందే. పేరు మార్చుకుంటే కలిసి వస్తుందని, లేదా పేరులో ఫలానా అక్షరం మార్చుకుంటే బ్రేక్ వస్తుందని నమ్ముతూంటారు. కెరీర్ లో స్ధబ్దత వచ్చినప్పుడే ఇలాంటివన్నీ చేస్తూంటారు. ఇప్పుడు మధురిమ పరిస్దితి అలాగే ఉంది.

సినిమాల్లో విలన్‌ వేషాలు వేసే అజయ్‌ హీరోగా పరిచయం చేస్తూ వచ్చిన ఆ ఒక్కడు సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ మధురిమ. ఈ సెక్సీ బ్యూటీ పలు తెలుగు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఆమెకు సరైన బ్రేక్ రాలేదు. దాంతో ఇప్పుడామె తన పేరు మార్చుకుని కెరీర్ టర్న్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యింది. తన పేరుని నైనా బెనర్జీగా మార్చుకుంది.

మధురిమ ఫోటో గ్యాలరి

బాలీవుడ్‌లో ఒక నైట్ స్టాంజ్ అనే ఓ అడల్ట్ కంటెంట్ మూవీ వస్తోంది. సన్నీ లియోన్ హీరోయిన్‌గా అంటే సహజంగానే అడల్ట్ కంటెంట్ ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీలో నైరా బెనర్జీ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాతో బాలీవుడ్ లో సెటిల్ అవ్వాలని మధురిమ పేరుని నైనా బెనర్జీగా మార్చుకుంది.

Madhurima changed her name

ముందే చెప్పుకున్నట్లు తెలుగులో చాలానే సినిమాలు చేసిన మధురిమ. హీరోయిన్ గాను ఐటెం భామగాను చాలానే తెలుగు సినిమాలు చేసింది మధురిమ అలియాస్ నైరా బెనర్జీ. ఆరెంజ్ మూవీలో రామ్ చరణ్ పక్కన కాసేపు కనిపించిన ఎక్స్ పీరియన్స్ కూడా ఉంది. కొత్త జంటలో ఈ భామ చేసిన అటు అమలాపురం ఇటు పెద్దాపురం ఐటెం సాంగ్ అయితే కుర్రకారుతో కేకలు పెట్టించింది. అయితే ఎందుకనో ఆమెను పట్టించుకునేవారు కరువయ్యారు.

కానీ టాలీవుడ్ లో ఈ భామకు బ్రేక్ మాత్రం రాలేదు. ఆ తర్వాత కన్నడ - మలయాళ చిత్రాల్లో కూడా చాలానే ప్రయత్నాలు చేసినా కాలం కలిసి రాలేదు. దీంతో.. ఇప్పుడు పేరు మార్చుకుని బాలీవుడ్ వెళ్లిపోయింది మధురిమ. చూడాలి ,ఇక్కడైనా ఆమె ఈ కొత్త పేరుతో సెటిలవుతుందో లేదో.

English summary
Madhurima changed her name to Nyra Banerjee. Madhurima never really had a break in Tollywood and her career is most patchy. In order to change her luck for Bollywood, the actress changed her name.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu