ఆమెకు కూడా వర్మ నుంచి పిలుపు

By Srikanya

వరసపెట్టి తెలుగు ప్లాప్ హీరోయిన్స్ ని అందరినీ వర్మ బాలీవుడ్ కి దిగుమతి చేసే స్కీమ్ లో ఉన్నట్లున్నాడు.తాజాగా ఆ లిస్ట్ లో మధుశాలిని చేరింది.తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మకి ఇక్కడ అవకాశాలు కరవయ్యాయి.పోనీ తమిళంలో బాలా దర్శకత్వంలో చేసిన 'వాడు-వీడు'చిత్రం అయినా కెరీర్ పరంగా కిక్ ఇస్తుంది అనుకుంటే అదీ కనపడలేదు. ఈ నేపధ్యంలో ఆమె దిగాలుగా ఉన్న సమయంలో రామ్ గోపాల్ వర్మ నుంచి పిలువు వచ్చింది.రామ్‌గోపాల్‌ వర్మ కొత్త చిత్రం 'డిపార్ట్‌మెంట్‌'లో ఆమెకు చోటిచ్చాడు.ఆ చిత్రంలో మధుశాలిని మాఫియా ముఠా సభ్యురాలిగా కనిపిస్తుందని సమాచారం.దాంతో ఇప్పటికే ఆ చిత్రంలో 'డాన్‌ శీను'లో నటించిన అంజనా సుఖానీకి,మంచు లక్ష్మి ప్రసన్నకు అవకాశమిచ్చాడు.ఇంకా ఎందరు ఈ సినిమాలోకి వస్తారో అని అంతా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ చిత్రంలో కీలకపాత్రలను అమితాబ్‌బచ్చన్‌, సంజయ్‌దత్‌, దగ్గుబాటి రానాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X