»   » ఫామ్ హౌస్ లో దొరికిన హీరోయిన్, అరెస్ట్...

ఫామ్ హౌస్ లో దొరికిన హీరోయిన్, అరెస్ట్...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Leena Maria Paul
న్యూఢిల్లీ: 'మద్రాసు కేఫ్‌' సినిమాలో నటించిన మలయాళ ముద్దుగుమ్మ యువ హీరోయిన్‌ లీనా మరియాపాల్‌(25), ఆమె స్నేహితుడు బాలాజీ అలియాస్‌ చంద్రశేఖర్‌ను దక్షిణ ఢిల్లీలోని ఓ వ్యవసాయ క్షేత్రం(ఫామ్ హౌస్) లో మంగళవారం పోలీసులు ఆరెస్టు చేశారు.

వీరి వ్యక్తిగత భద్రత సిబ్బందిగా ఉన్న మరో ఆరుగురిని కూడా అరెస్టు చేశారు. చెన్నైలోని కెనరా బ్యాంకు నుంచి నటి లీనా మరియాపాల్‌ రూ.19 కోట్ల భారీ రుణం తీసుకుంది. ఇందుకు తన స్నేహితుడు చంద్రశేఖర్‌ను ఐఏఎస్‌ అధికారిగా బ్యాంకు అధికారులకు పరిచయం చేసి వారిని నమ్మించి రుణం పొందింది.

తరువాత ఈ రుణం తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టారు. అప్పటి నుంచి వీరు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో లీనా ఢిల్లీలోని ఫతేపుర్‌బేరీలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో దాక్కుందని పోలీసులకు సమాచారం రావడంతో వీరిని అరెస్టు చేశారు.

English summary
South Indian actress Leena Maria Paul, who will be seen in John Abraham's production Madra Cafe, and her male friend were today arrested from a south Delhi farmhouse. Leena and her male friend were hiding in a bid to evade law in a case of cheating registered in Chennai.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu