»   »  కోర్టులో నటుడు ధనుష్‌కు చుక్కెదురు.. కేసు ఏమౌతుందో...

కోర్టులో నటుడు ధనుష్‌కు చుక్కెదురు.. కేసు ఏమౌతుందో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

మద్రాస్ హైకోర్టులో సినీ నటుడు ధనుష్‌కు చుక్కెదురైంది. ధనుష్ తమ కొడుకు అని మధురై జిల్లా మేలూరు మలమట్టికి చెందిన కదిరేశన్, మీనాక్షి దంపతులు మేలూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా తమ పోషణ నిమ్మిత్తం ధనుష్ నుంచి నెలకు రూ.65 వేలు ఇప్పించాలని ఫిర్యాదులో కోరారు.

 Madras High Court ask Actor Dhanush to submit school certificates.

ఈ నేపథ్యంలో ఈ కేసు రద్దు చేయాలని కోరుతూ నటుడు ధనుష్‌ మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసును విచారించిన కోర్టు పలుమార్లు విచారించింది. తాజాగా స్కూల్ సర్టిఫికెట్లను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఆ మేరకు సర్టిఫికెట్ కాపీలను ధనుష్ న్యాయవాది ఇటీవల కోర్టుకు సమర్పించారు.

ఈ క్రమంలో నకలు కాపీలకు బదులుగా ఒరిజినల్‌ సర్టిఫికెట్లను సమర్పించాలని కోర్టు ఆదేశిస్తూ విచారణను వచ్చే 17వ తేదీకి వాయిదా వేసింది. గతంలో ఈ సర్టిఫికెట్లను స్వీకరించడానికి మద్రాస్ హైకోర్టు నిరాకరించింది.

English summary
Popular actor Dhanush today moved a Madras High Court bench here, seeking quahing of a case filed in a lower court by an elderly couple who claimed that he was their son. In this case cournt directed to submit the school certificates.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu