twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కమల్ మెడకు చుట్టుకున్న "హిందూ ఉగ్రవాదం": మద్రాస్ హైకోర్ట్ సీరియస్, అరెస్ట్ చేసే అవకాశం

    హిందూ ఉగ్ర‌వాదం అంటూ క‌మ‌ల్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఇప్పుడు ఓ వ్య‌క్తి మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించారు. తన వ్యాఖ్యల ద్వారా హిందువులపై ఉగ్రవాదులు అనే ముద్రను కమల్ వేశారంటూ పిటిషన‌ర్ కోర్టుకు విన్న‌వించాడు

    |

    మామూలుగానే కొన్ని సంఘటన్ల మీద తనదంటూ ఒక అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పే కమల్ రాజకీయాల్లోకి వస్తున్నానంటూ నిర్ణయం ప్రకటించిన దగ్గరినుంచీ సామాజికాంసాలమీద స్పందించటం ఎక్కువ చేసాడు. నిజానికి కమల్ చేసిన వ్యాఖ్యలను ఎక్కువమందే సమర్థించారుకూడా. ఈ వ్యాఖ్య‌ల‌తో క‌మ‌ల్‌కు ఒక్క త‌మిళ‌నాడులోనే కాకుండా దేశ‌వ్యాప్తంగానూ మంచి మద్దతు లభించింది.

    చిక్కులో ఇరుక్కున్నాడు

    చిక్కులో ఇరుక్కున్నాడు

    అయితే ఆ వ్యాఖ్యల వల్లే కమల్ ఇప్పుడు చిన్న చిక్కులో ఇరుక్కున్నాడు. . క‌మ‌ల్ చేసిన వ్యాఖ్య‌లకు సంబంధించి కేసులు న‌మోదు చేసి విచార‌ణ చేపట్టాల‌ని ఏకంగా మ‌ద్రాస్ హైకోర్టు చెన్నై పోలీసుల‌కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాజకీయాల్లోకి దిగిపోయానంటూ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన క‌మ‌ల్‌. త‌న పార్టీ పేరును ప్ర‌క‌టించ‌క‌ముందే కేసులో ఇరుక్కున్న‌ట్టైంద‌న్న అభిప్రాయం వినిపిస్తోంది.

    దేశంలో హింందూ ఉగ్ర‌వాదం

    దేశంలో హింందూ ఉగ్ర‌వాదం

    అయినా క‌మ‌ల్ చాలా వ్యాఖ్య‌లే చేశారు క‌దా. ఆ వ్యాఖ్య‌ల్లోని ఏ కామెంట్ ఆధారంగా క‌మ‌ల్‌పై కేసు న‌మోదు చేయాల‌ని కోర్టు ఆదేశించిందంటే... ఇటీవ‌ల ఆయ‌న ఓ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. దేశంలో హింందూ ఉగ్ర‌వాదం ఉంద‌ని ప్ర‌క‌టించిన ఆయ‌న ఆ ఉగ్ర‌వాదం నానాటికీ పెచ్చ‌రిల్లుతోంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

     పిల్లలు కత్తులతో పొడుస్తున్నట్టు

    పిల్లలు కత్తులతో పొడుస్తున్నట్టు

    ఈ వ్యాఖ్య‌ల‌పై వెనువెంట‌నే కొన్ని వ‌ర్గాల నుంచి రియాక్ష‌న్ వినిపించినా... క‌మ‌ల్ దానిని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. అంతేకాకుండా తన పోస్టర్ వేలాడదీసి ఇద్దరు పిల్లలు కత్తులతో పొడుస్తున్నట్టుగా వచ్చిన ఒక వీడియోని త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట‌ట్ చేసిన క‌మ‌ల్‌... అలాంటి ఏ పాపం ఎరుగ‌ని పిల్లాడి చేతిలో చ‌నిపోవ‌డం త‌న‌కు ఆనంద‌మేనంటూ మరో సంచ‌ల‌నాత్మ‌క కామెంట్ విసిరారు.

    మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించారు

    మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించారు

    హిందూ ఉగ్ర‌వాదం అంటూ క‌మ‌ల్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఇప్పుడు ఓ వ్య‌క్తి మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించారు. తన వ్యాఖ్యల ద్వారా హిందువులపై ఉగ్రవాదులు అనే ముద్రను కమల్ వేశారంటూ పిటిషన‌ర్ కోర్టుకు విన్న‌వించాడు. హిందువులకు వ్యతిరేకంగా విషాన్ని వ్యాపింపజేసేందుకు క‌మ‌ల్‌ ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.

    కమల్ వ్యాఖ్యల్లో విచారించదగిన అంశాలు

    కమల్ వ్యాఖ్యల్లో విచారించదగిన అంశాలు

    ఈ రోజు హిందువులను ఉగ్రవాదులు అన్నారని... రేపు, ముస్లింలను లేదా క్రిస్టియన్లను ఉగ్రవాదులు అంటారని తెలిపారు. పిటిష‌న‌ర్ వాద‌న‌తో ఆలోచ‌న‌లో ప‌డ్డ కోర్టు... కమల్ వ్యాఖ్యల్లో విచారించదగిన అంశాలున్నాయ‌ని, ఆయ‌న‌పై కేసు నమోదు చేయాలని చైన్నై నగర పోలీసులను ధ‌ర్మాస‌నం ఆదేశించింది.

    మానసికంగా బలహీనున్ని చేయాలని

    మానసికంగా బలహీనున్ని చేయాలని

    మ‌రి ఈ కేసు విచార‌ణ ఏ మ‌లుపులు తిరుగుతుందో చూడాలి. మొత్తానికి కమల్ ని ఇప్పటినుంచే ఇబ్బందులకు గురి చేసి పార్టీ పెట్టకముందే అతన్ని మానసికంగా బలహీనున్ని చేయాలని ప్రభుత్వ ఆలోచన అన్న ఇంకో వాదన కూడా తమిళ నాడు లో వినిఒపిస్తోంది.

    English summary
    Justice M S Ramesh passed the order on a petition by G Devarajan, a registered advocate clerk in the high court, seeking a direction to the police to register the FIR against the actor based on his complaint.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X