twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరో ధనుష్‌కు ఊరట: మా పుత్రుడంటూ దాఖలైన పిటిషన్ కొట్టివేత

    వృద్ధ దంపతుల కేసులో హీరో ధనుష్‌కు భారీ ఊరట లభించింది. ధనుష్ తమ కుమారడంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది.

    By Pratap
    |

    చెన్నై: తమిళ హీరో ధనుష్‌కు కోర్టులో భారీ ఊరట లభించింది. హీరో ధనుష్ తమ కొడుకేనని, తమ బాగోగులు చూసుకోవటం లేదని మేలూర్‌కు చెందిన ఓ వృద్ధ దంపతులు కోర్టు మెట్లు ఎక్కిన సంగతి తెలిసిందే. ఈ కేసులో శుక్రవారం మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ తుది తీర్పు వెల్లడించింది.

    మద్రాస్ హైకోర్టులోని మదురై బెంచ్ ఈ కేసును కొట్టేసింది. దీంతో హీరో ధనుష్‌కు ఈ కేసు నుంచి ఊరట లభించింది. హీరో ధనుష్ ఇంతకు క్రితమే తాను వాళ్ల కొడుకును కాదని, తాను 1983లో జులై 28న ఎగ్మోర్ ప్రభుత్వ ఆస్పత్రిలో కృష్ణమూర్తి, విజయలక్ష్మి దంపతులకు జన్మించానని, అప్పట్లో తన పేరు వెంకటేశ్ ప్రభు అని, సినిమాల్లోకి వచ్చాక ధనుష్‌ కే రాజాగా పేరు మార్చుకున్నానని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

    Madras High Court quashes petition against hero Dhanush

    దీనికి బదులుగా మేలూరు దంపతులు - ధనుష్ 1985 నవంబర్7న మధురైలోని ప్రభుత్వ రాజాజీ ఆస్పత్రిలో జన్మించాడని తమ వద్ద ఆధారాలున్నాయని కౌంటర్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. ఇరువురు జనన ధృవీకరణ, విద్యా సంబంధ పత్రాలను సమర్పించాలని ఆదేశించింది. ఇప్పటికి తుది తీర్పు వెల్లడించింది.

    మేలూరు దంపతులు దాఖలు చేసిన పత్రాలను పరిశీలించిన తర్వాత కోర్టు ఆ తీర్పు వెలువరించింది. పుట్టుమచ్చలు చూపించాలని హీరో ధనుష్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాంతో మేలూరు దంపతులు చెప్పినట్లు ధనుష్‌కు పుట్టుమచ్చలు లేకపోవడంతో కోర్టు ఆ కేసును కొట్టేసింది.

    లేజర్ ట్రీట్‌మెంట్‌తో ధనుష్ పుట్టుమచ్చలు తొలగించుకుని ఉంటాడనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. దాతో డిఎన్ఎ పరీక్షకు న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది.. అయితే, అందుకు ధనుష్ నిరాకరించాదడు. ఈ క్రమంలో ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు వృద్ధ దంపతుల పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో ధనుష్‌కు ఊర లభించింది.

    English summary
    In a big releif to Tamil hero and rajinikanth's son-in-law Dhanush - madurai bench of Madras High Court quashed the petition file bt Meluru couple.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X