twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళి ఉద్వేగంగా గుర్తు చేసుకున్నారు(ఫొటోలు)

    By Srikanya
    |

    హైదరాబాద్: ప్రతీ దర్శకుడుకి తన చేసిన సినిమాలో ఓ ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. ఎందుకంటే ఐడియా మొదలై స్క్రిప్టుగా రూపొందే దశనుంచీ, సినిమా పూర్తై థియోటర్ లో ఆడి వెళ్లే దాకా దాని ఆలోచనలు దర్శకుడులో అంతర్గతంగా ప్రయాణం చేస్తూనే ఉంటాయి. అలాంటి సినిమా మెగా హిట్టై రికార్డులు క్రియేట్ చేస్తే ఇంక ఆ దర్శకుడు...ఆ చిత్రం ఙ్ఞాపకాలు గురించి చెప్పక్కర్లేదు.

    రామ్‌చరణ్‌, కాజల్‌ అగర్వాల్‌ జంటగా ఎస్‌.ఎస్‌. రాజమౌళి రూపొందించిన 'మగధీర' చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. అది విడుదలై జూలై 30తో ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజమౌళి ట్విట్టర్‌ పేజీకి అభినందనలు వెల్లువెత్తాయి. వీటికి రాజమౌళి స్పందించారు.

    తను మర్చిపోలేని ఆ జర్ని ఇలా ఫైవ్ ఇయర్స్ ఆఫ్ మగధీర అంటూ ఆయన రాసి మనకు అందించారు. అంతేకాక పవన్ కళ్యాణ్ ఏమన్నారు... శ్రీహరి ఎలా స్పందించారు. చిరంజీవి గారి ప్రశంసలు ఏమిటి అనేవి గుర్తు చేసుకున్నారు.

    ఆ భావోద్వేగ ఙ్ఞాపకాలు స్లైడ్ షోలో...

     మా భాగ్యం

    మా భాగ్యం

    ఐదేళ్ల ‘మగధీర' ట్వీట్స్‌తో నిండిపోయిన నా పేజీని ఇప్పుడే చూశాను. చాలా మంది ప్రేమగా గుర్తు చేసుకొనే ఆ చిత్రంలో భాగమవడం మా భాగ్యం అన్నారు రాజమౌళి.

    చిరు, శ్రీహరి ల...

    చిరు, శ్రీహరి ల...

    అప్పట్లో చిరంజీవిగారి ప్రశంసలు, మొదటిసారి స్ర్కిప్టు వినిపించినప్పుడు శ్రీహరిగారి కళ్లలో నీటి రూపంలో కనిపించిన భావోద్వేగం ఇప్పటికీ జ్ఞాపకమొస్తుంటాయి అన్నారు రాజమౌళిన.

     పవన్ మాటలు ఎలా మర్చిపోగలను..

    పవన్ మాటలు ఎలా మర్చిపోగలను..

    సినిమా విడుదల తర్వాత ‘‘ఈ సినిమా రూపకల్పనకు రెండేళ్లు పట్టి ఉండొచ్చు. కానీ ఓ ఫిల్మ్‌మేకర్‌గా నాకు తెలుసు - మీ మైండ్‌లో అంతకంటే ముందునుంచే ఇది తయారవుతూ ఉందని'' అన్న పవన్‌కల్యాణ్‌ మాటలను ఎలా మరచిపోగలను అని గుర్తు చేసుకున్నారు ఆయన.

     రజనీకాంత్ గారు...

    రజనీకాంత్ గారు...

    రజనీకాంత్‌గారు ఏమన్నారో సరిగా గుర్తిలేదు, ఆయన మార్కు నవ్వుతప్ప'' అంటూ ఎమోషనల్‌గా ట్వీట్‌ చేశారు రాజమౌళి.

     కలెక్షన్స్ కురించించింది

    కలెక్షన్స్ కురించించింది

    తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయిన చిత్రాల్లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మగధీర'ను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఈచిత్రం అప్పట్లో ఓ సంచలన విజయం సాధించింది. తెలుగు సినీ పరిశ్రమ ముక్కున వేలేసుకునేలా కలెక్షన్ల వర్షం కురిపించింది.

    బడ్జెట్ కు రెట్టింపు లాభం

    బడ్జెట్ కు రెట్టింపు లాభం

    ఈ చిత్ర నిర్మాణ వ్యయం రూ. 40 కోట్లుపైనే. నిర్మాతకు రెట్టింపు లాభాలు తెచ్చిపెట్టింది. ఈ చిత్రంలో ఉపయోగించిన అత్యున్నత సాంకేతిక పరిజ్ఞ్హానం విమర్శకుల ప్రశంశలను అందుకుంది

    English summary
    Rajamouli said..." Just saw my timeline filled with 5 years of Magadheera posts. All of us are blessed to be a part of that film which is so fondly remembered by so many.. Thank you..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X