»   » మగధీర పేరే బాహుబలి: ఈ రికార్డ్ ఎవరి ఖాతాలోకి?

మగధీర పేరే బాహుబలి: ఈ రికార్డ్ ఎవరి ఖాతాలోకి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాజమౌళి ఇప్పటి వరకూ తీసిన సినిమాలు తెలుగులో బంపర్ హిట్లే కానీ ఇతరభాషల్లోకి డబ్ అయ్యి పెద్దగా సాధించిందేం లేదు. రాజమౌళి అనే కాదు ఏ తెలుగు సినిమా హిందీలోకి డబ్ అయ్యి పెద్దగా ఆకట్టుకున్నది లేదు. అయితే బాహుబలి మాత్రం చరిత్రని తిరగ రాసింది. దక్షిణాది సినిమా అన్నా, తెలుగు నటులు అన్నా హీనంగా చూసే బాలీవుడ్ బాహిబలికి సాహో అంది.. ఎప్పుడూ లేనంతగా బాలీవుడ్ లో పెద్ద స్టార్ల సినిమాలను కూడా వెనక్కి నెట్టింది. అయితే ఈ సినిమా వల్ల ఇప్పుడు మగధీర కూడా అద్బుతమైన రికార్ద్ కొట్టింది.

రామ్ చరణ్ మగధీర సినిమా ఇప్పుడు ఒక అరుదైన రికార్డ్ అందుకుంది. అయితే ఈ క్రెడిట్ బాహుబలికి దక్కాలా లేక మగధీరకి దక్కాలా అన్నదగ్గరే చిన్న అయోమయం. అసలేమైందీ అంటే ఈ ఏడాది యూట్యూబ్ లో 100 మిలియన్లు దాటిన వ్యూస్ సాధించింది మగధీర. ఇంతవరకూ ఏ తెలుగు అనువాద చిత్రానికీ ఇంత భారీ పాపులారిటీ రాలేదు. అయితే ఇక్కడ అన్ని వ్యూస్ కి కారణం ఆ సినిమా పేరు బాహుబలి 2 కావటమే... అర్థం కాలేదు కదా మగధీర పేరు బాహుబలి ఏమిటీ అనుకుంటున్నారా ఇంతకీ జరిగిందేమిటీ అంటే.


బాహుబలి 2

బాహుబలి 2

'బాహుబలి 2' అనే టైటిల్‌తో ఈ సినిమాని అప్‌లోడ్‌ చేయడమే ఈ విజయానికి కారణం. గత ఏడాది ఫిబ్రవరిలో మగధీర హిందీ అనువాదానికి బాహుబలి 2 అని పేరు పెట్టి యూట్యూబ్‌లో పెట్టడంతో జనం ఎగబడి క్లిక్‌ చేసారు.


ఆ తర్వాత కానీ

ఆ తర్వాత కానీ

అది రాజమౌళి తీసిన మరో సినిమా అనే సంగతి తెలీలేదు. ఈ ట్రిక్‌ చాలా మందికి కోపం తెప్పించిందనేది 57 వేలకి పైగా వున్న డిస్‌లైకుల ద్వారానే తెలుస్తోంది.


కామెంట్స్‌

కామెంట్స్‌

కామెంట్స్‌ డిసేబుల్‌ చేయడం వల్ల జనం తిట్టడానికి లేకుండా పోయింది. అయినప్పటికీ లక్షా యాభై వేల మంది లైక్‌ కొట్టారనుకోండి. బాహుబలి కంటే ముందు రాజమౌళి ఈ చిత్రాన్ని హిందీలోకి అనువదించి వుంటే అప్పట్లోనే సంచలనం సృష్టించేదేమో.


మగధీర

మగధీర

హిందీ చిత్ర సీమలో మగధీర సంచలనాలకి తెర లేవకపోయినప్పటికీ యూట్యూబ్‌ వరకు ఈ చిత్రం ఒక గొప్ప రికార్డుని సాధించింది. టైటిల్‌తో చేసిన గిమ్మిక్‌ని వదిలేసి చరణ్‌ ఫాన్స్‌ ఈ ఫీట్‌ ఎంజాయ్‌ చేస్తున్నారనుకోండి, అది వేరే సంగతి.English summary
Telugu Movie Magadheera Directed by SS Rajamauli now breaks the record in YouTube., Magadheera hindi version crossed 100 million views
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu