»   » అందంగా ఉండాలంటే అదే బెస్ట్ రూట్..కాజల్

అందంగా ఉండాలంటే అదే బెస్ట్ రూట్..కాజల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సన్నగా ఉండటమే అందం కాదు. మంచి ఫిట్‌నెస్‌తో ఉంటేనే అసలైన అందం. మంచి ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే చాలు అంటూ మగధీరతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కాజల్ తన గ్లామర్ రహస్యాన్ని చెబుతోంది. అలాగే ఈ విషయాలు గుర్తించకుండా డైటింగ్‌ పేరుతో కడుపు మాడ్చుకోవడం తెలివితక్కువతనమని నా ఉద్దేశం అంటోందామె. అలాగే నేను పూర్తిగా శాకాహారిని. ఉదయాన్నే లేచి కాసేపు వ్యాయామం చేస్తాను. జిమ్‌ అందుబాటులో లేకపోతే యోగా చేస్తా. నీళ్లు బాగా తాగుతా. సమయానికి నిద్రపోతా. కంటినిండా నిద్ర ఉంటేనే కదా, ఆ తర్వాత రోజు షూటింగ్‌లో ఉత్సాహంగా కనిపించేది..ఇక జీరోసైజ్‌ ట్రెండ్‌ మీద నాకంత సదభిప్రాయం లేదు అంటోంది కాజల్‌. కాజల్ ఇవాళ చాలా మంది అమ్మాయిలకు గ్లామర్ లో రోల్ మోడల్. కాబట్టి ఆమె సలహాలు కూడా విలువైనవే. అందులోనూ అస్సలు ఖర్చు, శ్రమ లేనవి కాబట్టి ఆచరించవచ్చు...ఏమంటారు...

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu