»   » జాతీయఅవార్డు విజేతల్ని సత్కరించిన ‘మగధీర’ టీమ్‌

జాతీయఅవార్డు విజేతల్ని సత్కరించిన ‘మగధీర’ టీమ్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

రికార్డుల్ని తిరగరాసిన 'మగధీర" చిత్రం ఫిలింఫేర్‌ అవార్డుల్లోనూ సత్తా చాటింది. రామ్‌ చరణ్‌ హీరోగా నటించిన ఈ చిత్రానికి ఏకంగా ఆరు ఫిలింఫేర్‌ అవార్డులును సొంతం చేసుకున్న విషయం మీకు తెలిసిందే. అలాగే విజువల్‌ ఎఫెక్ట్స్‌ విభాగంలో కమల్‌ కన్నన్‌, 'ధీర ధీర..." పాటకు నృత్యం సమకూర్చిన శివశంకర్‌ మాస్టర్‌ కు జాతీయ అవార్డులు వచ్చిన విషయం కూడా మీకు తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 'మగధీర" టీమ్‌ వారిరువురిని ఫిలింనగర్‌ కల్చరల్‌ క్లబ్‌ లో సన్మానించింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు రాజమౌళి, నిర్మాత అల్లు అరవింద్‌తో పాటు 'మగధీర" టీమ్‌ అంతా హాజరై శివశంకర్‌ మాస్టర్‌ ను, కమల్‌ కన్నన్‌ ను సన్మానించి అభినందులు తెలియజేసారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu