»   » వీడియో: నిజంగా ఉంటే మా ఆయనతో మాట్లాడుకోవచ్చు.. ఏఎన్నార్‌తో మాట్లాడు చాలు, మహానటి డిలీటెడ్ సీన్!

వీడియో: నిజంగా ఉంటే మా ఆయనతో మాట్లాడుకోవచ్చు.. ఏఎన్నార్‌తో మాట్లాడు చాలు, మహానటి డిలీటెడ్ సీన్!

Subscribe to Filmibeat Telugu
నిజంగా ఉంటే మా ఆయనతో మాట్లాడుకోవచ్చు.. ఏఎన్నార్‌తో మాట్లాడు చాలు, మహానటి డిలీటెడ్ సీన్!

లెజెండరీ నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అద్భుత నటన, దర్శకుడు నాగ అశ్విన్ తెరకెక్కించిన తీరుకు ఆడియన్స్ బ్రహ్మ రథం పడుతున్నారు. సమంత, విజయ్ దేవరకొండ కీలక పాత్రల్లో నటించారు. సావిత్రి భర్త జెమిని గణేశన్ పాత్రలో మలయాళీ నటుడు దుల్కర్ సల్మాన్ నటించిన సంగతి తెలిసిందే.

సావిత్రి జీవితం గురించి అభిమానుల్లో అనేక అపోహలు, సందేహాలు ఉన్నాయి. వాటన్నింటికి సమాధానం ఇచ్చేలా ఈ చిత్రం అద్భుత విజయం సాధించింది. పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. తాజగా చిత్రంలో తొలగించిన సన్నివేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఎన్నో అద్భుత చిత్రాలు

ఎన్నో అద్భుత చిత్రాలు

సావిత్రి తన సినీ జీవితంలో అద్భుతమైన దృశ్య కావ్యాల్లాంటి చిత్రాలెన్నింటిలోనో నటించారు. సావిత్రి పేరు చెప్పగానే తెలుగు వారికీ మూగమనసులు, మాయాబజార్, పాతాళభైరవి లాంటి అద్భుతం చిత్రాలు గుర్తుకు వస్తాయి.

 చిలిపి శశిరేఖ

చిలిపి శశిరేఖ

మాయాబజార్ చిత్రంలో శశిరేఖ పాత్రలో సావిత్రి చేసిన అల్లరిని ఎవరూ మరచిపోలేరు. ఏఎన్నార్ ఈ చిత్రంలో అభిమన్యుడిగా, సావిత్రి శశిరేఖగా కలసి నటించారు. ఇందులో ప్రతి సన్నివేశమూ ఆణిముత్యమే. ఆమె పలికించిన హావభావాలు మరెవరికి సాధ్యం కావేమో.

ప్రియదర్శిని పేటిక

ప్రియదర్శిని పేటిక

మాయాబజార్ చిత్రంలో ప్రియదర్శి పేటిక సన్నివేశం చాలా బావుంటుంది. ఆ సన్నివేశ చిత్రికరణ సమయంలో సావిత్రి ఎలా ఉండేది అనే అంశాన్ని మహానటి చిత్రంలో చిత్రీకరించారు. సినిమాలో చేర్చని ఓ సన్నివేశాన్ని తాజాగా సోషల్ మీడియాలో విడుదల చేయగా అది వైరల్ అయింది.

ఏఎన్నార్ తో మాట్లాడు చాలు

ఏఎన్నార్ తో మాట్లాడు చాలు

సావిత్రి పాత్రలో ఉన్న కీర్తి సురేష్ ప్రియదర్శిని పేటిక ముందు నటించడానికి సిద్ధంగా ఉన్న సన్నివేశం అది. ఇలాంటిది నిజంగానే ఉంటె చాలా బావుండేది. వేరే షూటింగ్ లో ఉన్న మా ఆయనతో మాట్లాడుకోవచ్చు అని కీర్తి సురేష్ అంటుంది. చిత్ర దర్శకుడు కెవి రెడ్డి పాత్రలో ఉన్న క్రిష్.. ఇప్పుడు నాగేశ్వర్ రావుతో మాట్లాడు చాలు అని అంటాడు.

వీడియో వైరల్

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ చిత్రంలో ఎస్వీ రంగారావు పాత్రలో మోహన్ బాబు కామియో రోల్ పోషించారు. ఏఎన్నార్ పాత్రలో నాగ చైతన్య నటించాడు.

English summary
Mahanati deleted scene goes viral. Mayabazaar shooting setup
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X