twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహానుభావుడు ఫస్ట్ రిపోర్ట్.. శర్వా, మారుతి కామెడీ మ్యాజిక్

    గురువారం రాత్రి అమెరికాలో ఈ చిత్రం ప్రదర్శన ముందుగానే ప్రారంభమైంది. మహానుభావుడు చిత్రానికి సంబంధించిన గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు తెలుగు వన్ ఇండియా, తెలుగు ఫిల్మీబీట్ రీడర్ల కోసం..

    By Rajababu
    |

    శర్వానంద్ హీరోగా మహానుభావుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి సెన్సేషనల్ దర్శకుడు మారుతి దర్శకత్వం వహించాడు. గురువారం రాత్రి అమెరికాలో ఈ చిత్రం ప్రదర్శన ముందుగానే ప్రారంభమైంది. మహానుభావుడు చిత్రానికి సంబంధించిన గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు తెలుగు వన్ ఇండియా, తెలుగు ఫిల్మీబీట్ రీడర్ల కోసం.. అలాగే కొద్ది సేపట్లో ఎక్స్‌క్రూజివ్‌గా రివ్యూను మీ కోసం అందించనున్నాం.

    అతి శుభ్రత వ్యాధి నేపథ్యంగా

    అతి శుభ్రత వ్యాధి నేపథ్యంగా

    భలే భలే మొగాడివో చిత్రంలో మతిమరుపు కథతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచిన మారుతి.. ప్రస్తుతం అతి శుభ్రత (ఓసీడీ) అనే వ్యాధి నేపథ్యంతో మహానుభావుడు చిత్రాన్ని తెరకెక్కించారు.

    శర్వానంద్ వాయిస్ ఓవర్‌తో

    శర్వానంద్ వాయిస్ ఓవర్‌తో

    151 నిమిషాల నిడివి ఉన్న మహానుభావుడు సినిమా హీరో శర్వానంద్ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమవుతుంది. తన ప్రేమ కథను చెప్పడం ద్వారా ప్రేక్షకుడిని కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు దర్శకుడు మారుతి.

    శర్వానంద్, వెన్నెల కిషోర్ కామెడీ

    శర్వానంద్, వెన్నెల కిషోర్ కామెడీ

    ఓసీడితో బాధపడే శర్వానంద్‌పై కామెడీ సీన్లను ఆకట్టుకునేలా ఉన్నాయి. వెన్నెల కిషోర్ స్నేహితుడిగా ఎంట్రీ ఇచ్చి వినోదాన్ని పంచుతున్నాడు. వారి మధ్య కామెడీ సీన్లు ఆహ్లాదకరంగా ఉన్నాయి.

     మెహ్రీన్ ప్రేమలో శర్వా

    మెహ్రీన్ ప్రేమలో శర్వా

    హీరో శర్వానంద్, హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదీ ఒకే ఆఫీస్‌లో పనిచేసే ఉద్యోగులు. మెహ్రీన్ ప్రేమలో శర్వానంద్ పీకల్లోతు మునిగిపోతాడు. వారి మధ్య వచ్చే తొలి పాట రెండు కళ్లు ఫీల్‌ గుడ్‌గా ఉంది.

     శర్వానంద్ ప్రేమ కథ

    శర్వానంద్ ప్రేమ కథ

    శర్వానంద్, మెహ్రీన్ ప్రేమకథ ఓ పల్లెటూరుకు చేరుకున్నది. హీరోయిన్ తండ్రిగా నాజర్ ఎంట్రీతో సినిమా కొత్త మలుపు తిరుగుతుంది.

    శర్వానంద్‌పై పాట

    శర్వానంద్‌పై పాట

    శర్వానంద్, మెహ్రీన్ మధ్య పలు హాస్య సన్నివేశాల తర్వాత మహానుభావుడవేరా అనే టైటిల్ సాంగ్ మొదలవుతుంది. శర్వానంద్‌పై పాటను చిత్రీకరించారు.

    హీరో, తల్లి మధ్య ఎమోషనల్

    హీరో, తల్లి మధ్య ఎమోషనల్

    శర్వానంద్, తన తల్లికి మధ్య సన్నివేశాలు ఆకట్టుకునేలా చిత్రీకరించాడు. దర్శకుడు మారుతి. మూడో పాట కిస్ మి బేబీ తర్వాత ఆసక్తికరమైన సన్నివేశంతో ఇంటర్వెల్ కార్డు పడింది.

    కామెడీపైనే మారుతి

    కామెడీపైనే మారుతి

    సెకండాఫ్‌లో మై లవ్ ఈజ్, భామలు భామలు పాటలతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచాడు దర్శకుడు మారుతి. శర్వానంద్ తనదైన మార్కు నటనను ప్రదర్శిస్తున్నాడు. ప్రధానంగా సినిమా వినోదాత్మకంగా సాగడం జరుగుతున్నది.

    హీరోయిన్ రక్షించే..

    హీరోయిన్ రక్షించే..

    ప్రీ క్లైమాక్స్‌లో కామెడీ నుంచి యాక్షన్‌కు సీన్ మారింది. విలన్ గ్యాంగ్ నుంచి హీరోయిన్‌ను శర్వానంద్ రక్షించే సీన్ డిజైన్ చేశాడు దర్శకుడు.

    ఆసక్తికరంగా క్లైమాక్స్

    ఆసక్తికరంగా క్లైమాక్స్

    క్లైమాక్స్‌ ముందులో భారీ కుస్తీ పోటి ఆసక్తికరంగా మారింది. సినిమాకు సంబంధించిన సన్నివేశాలను సామాజిక మాధ్యమం, ఇంటర్నెట్‌లో లభ్యమైన సమాచారం ద్వారా అందించడం జరిగింది. త్వరలోనే పూర్తి స్థాయి రివ్యూ అందిస్తాం.

    English summary
    Mahanubhavudu is an upcoming Telugu-language romantic action comedy film writtem and directed by Maruthi Dasari. It features Sharwanand and Mehreen Pirzada in the lead roles. scheduled for a worldwide release on 29 September 2017.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X