For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  శర్వానంద్ మా ఇంటి హీరో : ‘మహానుభావుడు’ వేడుకలో ప్రభాస్ (ఫోటోస్)

  By Bojja Kumar
  |

  శ‌ర్వానంద్, మెహ‌రీన్ హీరోయిన్ హీరో హీరోయిన్లుగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో యు.వి.క్రియేష‌న్స్ వారు నిర్మించిన చిత్రం 'మహానుభావుడు'. వంశీ, ప్ర‌మొద్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఆదివారం హైద‌రాబాద్‌లో గ్రాండ్ గా జ‌రిగింది. సెప్టెంబర్ 29న సినిమా విడుదల కాబోతోంది.

  బాహుబలి స్టార్ ప్ర‌భాస్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ప్రభాస్ ఎఫెక్టుతో ఈ వేడుకకు అభిమానులు భారీగా తరలి వచ్చారు. హీరో శర్వానంద్ ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ఎన్నడూలేనంత గ్రాండ్ గా ఈ వేడుక జరిగింది.

  శర్వా మా ఇంటి హీరో, నా బ్రదర్

  శర్వా మా ఇంటి హీరో, నా బ్రదర్

  ‘మహానుభావుడికి' గిఫ్టుగా డెట్టాల్, శానిటైజర్, ఇతర క్లీనింగ్ వస్తువులతో కలిసి ఓ బాక్స్ అందించిన అనంతరం ప్రభాస్ మాట్లాడుతూ.... `శ‌ర్వా మా ఇంటి హీరో. ర‌న్ రాజా ర‌న్ సినిమాను ఎవ‌రితో చేయాల‌నుకున్న‌ప్పుడు వంశీ వెంటనే శ‌ర్వానంద్ పేరు చెప్పాడు. త‌న యాట్యిట్యూడ్ బావుంటుంద‌ని కూడా చెప్పాడు. త‌నెప్పుడూ ఎంట‌ర్‌టైన్మెంట్ క్యారెక్ట‌ర్ చేయ‌లేదు క‌దా అని అంటే, ట్రై చేయండ‌న్నా, న‌చ్చితే కంటిన్యూ చేద్దాం అన్నాడు. ఆ మాట‌ల‌కు నేను, వంశీ, ప్ర‌మోద్ స‌హా అంద‌రం త‌న‌కు ఫ్యాన్స్ అయిపోయాం. ఆరోజు నుండి శ‌ర్వా నాకు బ్ర‌ద‌ర్ అయిపోయాడు.' అన్నారు.

  Mahanubhavudu Copied From Malayalam Film ‘మహానుభావుడు’.ఆ సినిమాకు కాపీనా?
  పడి పడి నవ్వాను

  పడి పడి నవ్వాను

  సినిమా కెప్టెన్ మారుతిగారి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ప్ర‌మ‌క‌థా చిత్ర‌మ్ నా ఫేవరెట్. పడి పడి నవ్వాను. ఒక మనిషిని ఇంత నవ్వించాలంటే నాట్ ఎ జోక్. అలాగే భ‌లే భ‌లే మ‌గాడివోయ్ సినిమాలో కూడా. ప్రేమ‌క‌థాచిత్ర‌మ్‌, భ‌లే భ‌లే మ‌గాడివోయ్ సినిమాలకంటే మహానుభావుడు ఈ సినిమా ఇంకా బావుండాల‌ని కోరుకుంటున్నాను. మీరు కూడా వెరీ కాన్ఫిడెంటుగా ఉన్నారు. తమన్ మ్యూజిక్ బావుంది. అదే విధంగా కెమెరామెన్, ఇతర టెక్నీషియన్స్ బాగా పని చేశారు. టీమ్ అంతా వండర్ ఫుల్. సినిమా బ్లాక్‌ట‌స్టర్ అవుతుంద‌ని భావిస్తున్నాను. రేపు పొద్దున సూప‌ర్‌స్టార్ మనోడు(శ‌ర్వానంద్‌) `` అంటూ ప్రభాస్ ప్రసంగం ముగించారు.

  రియల్ లైఫ్ మహానుభావుడు ప్రభాస్

  రియల్ లైఫ్ మహానుభావుడు ప్రభాస్

  హీరో శ‌ర్వానంద్ మాట్లాడుతూ - ``నేను సినిమాలో మ‌హానుభావుడ‌ు నేను అయితే అయితే రియ‌ల్ లైఫ్‌లో మహానుభావుడు ప్ర‌భాస్ అన్న. నేనేదో చెప్పాలని చెప్పడం లేదు. మనస్తూర్తిగా చెబుతున్నాను. ఎందుకంటే మ‌న జీవితంలో మ‌న‌ల్ని ప్రేమించేవాళ్లు న‌లుగురైదుగురు ఉంటారు. కానీ ప్ర‌భాస్ అన్న‌కు అలాంటి బెస్ట్ ఫ్రెండ్స్ ఓ పాతిక మంది ఉన్నారు. దాన్ని బట్టి అర్థం అవుతుంది తనకు ప్రేమ ఇవ్వడమే కానీ ఇంకేమీ తెలియదు.... అని వ్యాఖ్యానించారు.

  ఎదుటోడు ఎదగాలని కోరుకునే వ్యక్తి

  ఎదుటోడు ఎదగాలని కోరుకునే వ్యక్తి

  ‘నా సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా ఫస్ట్ డే ఆఫీసుకు పిలిచి టైం నాకంటే ఎక్కువ టెన్ష‌న్ ప‌డేది ప్ర‌భాస్ అన్న‌. నేను ర‌న్ రాజా ర‌న్ చేసిన‌ప్పుడు నాకు బాగా గుర్తు, నువ్వు హిట్ కొట్టావురా ఎంజాయ్ చెయ్ అన్నారు. నాకేమో నిజంగా హిట్టుకొట్టామా? అని ఉండేది. అలా ప‌క్క‌వాడు కూడా పైకి రావాల‌ని జెన్యూన్ గా కోరుకునే వ్యక్తుల్లో మొదట ఉండేది ప్రభాస్ అన్న' అని శర్వా చెప్పుకొచ్చారు.

  హ్యాపీగా నిద్రపోయిన సినిమా

  హ్యాపీగా నిద్రపోయిన సినిమా

  ‘ఇక సినిమా గురించి చెప్పాలంటే ట్రైలర్ చూశారు, మంచి రెస్పాన్స్ వస్తోంది. మంచి సినిమా. సినిమా చూసి అంద‌రూ త‌ప్ప‌కుండా ఎంజాయ్ చేస్తారు. టెక్నీషియన్స్ గురించి తప్పకుండా చెప్పాలి. మాకు మెయిన్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ మారుతిగారు. చాలా రోజుల త‌ర్వాత ఈరోజు డైరెక్ట‌ర్ నాతో మంచి సీన్ చేయించుకున్నాడురా, భలే చేయించుకున్నాడురా డైరెక్టర్ అని నిద్ర‌పోయిన సినిమా ఇది. అలా సినిమాను చ‌క్క‌గా డైరెక్ట్ చేసిన మారుతిగారికి థాంక్స్‌. మా నిర్మాతలకు పెద్ద థాంక్స్,` అంటూ శర్వానంద్ ప్రసంగం ముగించారు.

  శర్వానంద్ విశ్వరూపం చూస్తారు

  శర్వానంద్ విశ్వరూపం చూస్తారు

  ద‌ర్శ‌కుడు మారుతి మాట్లాడుతూ - `ఈ క‌థ‌కు హీరోగా ఎవ‌రైతే బావుంటుందోన‌ని అనుకుంటున్న త‌రుణంలో శ‌ర్వానంద్ హీరోగా చేస్తాన‌ని ఒప్పుకోవ‌డ‌మే కాకుండా త‌న న‌ట‌న‌తో పాత్ర‌కు ప్రాణం పోశాడు. శ‌ర్వానంద్ విశ్వ‌రూపాన్ని థియేట‌ర్‌లో చూస్తారు. చాలా అద్భుతంగా చేశాడు. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌లో నానితో ఎంత ఎగ్జ‌యిట్ అయ్యానో అంత కంటే ఎక్కువ ఎగ్జ‌యిట్‌మెంట్ క‌లిగింది. ప్ర‌తి టెక్నిషియ‌న్‌, ఆర్టిస్టులు చ‌క్క‌గా స‌పోర్ట్ చేసి సినిమాను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లారు... అని తెలిపారు.

  ప్రభాస్ గారితో సినిమా తీస్తా

  ‘ఇలాంటి కాన్సెప్ట్స్ అరుదుగా వ‌స్తుంటాయి. ఇలాంటి కాన్సెప్ట్స్ సినిమాలు అరుదుగా వ‌స్తుంటాయి. వ‌చ్చిన‌ప్పుడు అస‌లు మిస్ కాకూడ‌దు. మంచి ప్యామిలీ ఎమోష‌న‌ల్ మూవీ. ఇలాంటి మంచి సినిమా తీసే అవ‌కాశం ఇచ్చిన యువి క్రియేష‌న్స్‌కు రుణ‌ప‌డి ఉంటాను. ప్ర‌భాస్‌గారితో ఎప్ప‌టికైనా సినిమా తీస్తాను. అంద‌రికీ థాంక్స్‌` అని మారుతి తన ప్రసంగం ముగిముగించారు.

  న‌టీన‌టులు

  న‌టీన‌టులు

  శ‌ర్వానంద్‌, మెహ‌రిన్‌, వెన్నెల కిషోర్‌, నాజ‌ర్‌, భ‌ద్రం, క‌ళ్యాణి న‌ట‌రాజ్‌, పిజ్జాబాయ్‌, భాను, హిమ‌జ‌, వేణు, సుద‌ర్శ‌న్‌, సాయి, వెంకి, శంక‌ర్‌రావు, రామాదేవి, మ‌ధుమ‌ణి, రాగిణి, ర‌జిత‌, అబ్బులు చౌద‌రి, సుభాష్‌, ఆర్‌.కె తదిత‌రులు నటించారు.

  సాంకేతిక నిపుణులు

  సాంకేతిక నిపుణులు

  సంగీతం- ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌, సినిమాటోగ్రాఫ‌ర్‌- నిజార్ ష‌ఫి, ఆర్ట్‌-రవింద‌ర్‌, ఫైట్స్‌-వెంక‌ట్‌, ఎడిటింగ్‌- కొట‌గిరి వెంక‌టేశ్వ‌రావు, కోరియోగ్రఫి : రాజు సుందరం , గీత రచయితలు : సిరివెన్నెల సీత రామ శాస్త్రి , భాస్కర్ భట్ల, కె కె , ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌- ఎన్‌.సందీప్‌, కొ-ప్రోడ్యూస‌ర్‌- ఎస్‌.కె.ఎన్‌, ప్రోడ్యూస‌ర్స్‌- వంశి-ప్ర‌మోద్‌, స్టోరి, మాట‌లు,స్క్రీన్‌ప్లే,ద‌ర్శ‌క‌త్వం- మారుతి.

  దసరాకు గ్రాండ్ రిలీజ్

  దసరాకు గ్రాండ్ రిలీజ్

  ‘మహానుభావుడు' సినిమా దసరా సందర్బంగా సెప్టెంబర్ 29న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

  English summary
  Mahanubhavudu Movie Pre Release Function held at Hyderabad. Prabhas, Sharwanand, Maruthi Dasari, Thaman, Vamsi Krishna Reddy, Pramod Uppalapati, Nizar Shafi, Krishna Kanth, Bhaskarabhatla, Geetha Madhuri, Manisha Eerabathini, Shweta Pandit, Satya Srinivas, Sri Krishna, Sreemukhi at the event.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X