»   » మహానుభావుడు ప్రీ రివ్యూ: వినోదమే ప్రధానంగా.. శర్వానంద్ నటనపైనే..

మహానుభావుడు ప్రీ రివ్యూ: వినోదమే ప్రధానంగా.. శర్వానంద్ నటనపైనే..

Written By:
Subscribe to Filmibeat Telugu

ఎప్పటిలానే దసరా పండుగ ఈ ఏడాది కూడా సినీ అభిమానులకు ఫుల్లుగా వినోదాన్ని పంచుతున్నది. ఇప్పటికే రెండు భారీ బడ్జెట్ చిత్రాలు వెండితెరను తాకాయి. ఇక ఈ సీజన్‌లో చివరి చిత్రం మహానుభావుడు శుక్రవారం రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఈ చిత్రానికి సెన్సేషనల్ దర్శకుడు మారుతి దర్శకత్వం వహించాడు. మతి మరుపు అనే కాన్సెప్ట్‌తో భలే భలే మొగాడివో లాంటి చక్కటి వినోదాత్మక చిత్రాన్ని అందించిన మారుతి మరోసారి ఓ కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మహానుభావుడు చిత్రానికి సంబంధించిన గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు తెలుగు వన్ ఇండియా, తెలుగు ఫిల్మీబీట్ రీడర్ల కోసం..

అతి శుభ్రత వ్యాధి నేపథ్యంగా

అతి శుభ్రత వ్యాధి నేపథ్యంగా

భలే భలే మొగాడివో చిత్రంలో మతిమరుపు కథతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచిన మారుతి.. ప్రస్తుతం అతి శుభ్రత (ఓసీడీ) అనే వ్యాధి నేపథ్యంతో మహానుభావుడు చిత్రాన్ని తెరకెక్కించారు.

టీజర్లకు మంచి స్పందన

టీజర్లకు మంచి స్పందన

మహానుభావుడు చిత్రానికి సంబంధించిన టీజర్లు, ఫస్ట్‌లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించాయి. దాంతో దసరా సీజన్‌లో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం కూడా చక్కటి వినోదం పంచడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

 మెహ్రీన్ హీరోయిన్‌గా

మెహ్రీన్ హీరోయిన్‌గా

మహానుభావుడు చిత్ర కథ ఏమిటంటే.. హీరో శర్వానంద్ ఓసీడి వ్యాధితో బాధపడుతుంటాడు. అంటే శుభ్రతపై ధ్యాస ఎక్కువ. నీట్‌గా ఉండాలను కోవడం ఈ సినిమాలో హీరోకు లోపం. అతని వల్ల మిగితా వాళ్లు, ముఖ్యంగా హీరోయిన్‌ మెహ్రీన్‌కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయనేది కథాంశం.

మహానుభావుడిపై పాజిటివ్ టాక్

మహానుభావుడిపై పాజిటివ్ టాక్

హీరో శర్వానంద్ నటన ఈ చిత్రాన్ని మరోస్థాయికి తీసుకెళ్తుందనే మాట ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నది. అలాగే హీరోయిన్ మెహ్రీన్ గ్లామర్ అదనపు ఆకర్షణగా మారుతుంది అని చెప్పుకొంటున్నారు.

కిశోర్ కామెడీ వెన్నెల

కిశోర్ కామెడీ వెన్నెల

ఎంటర్‌టైన్‌మెంట్‌కు పెద్ద పీట వేసే మహానుభావుడు చిత్రంలో వెన్నెల కిషోర్‌ది కీలకమైన పాత్ర. ఎప్పటిలానే తనదైన శైలిలో కామెడీని పండించనున్నారనేది ఇన్‌సైడ్ టాక్. వెన్నెల కిషోర్ కామెడీ అద్భుతంగా పేలుతుందని చిత్ర నిర్వాహకులు ఆత్మ విశ్వాసంతో ఉన్నారు.

 మరో హిట్‌పై మారుతి నజర్

మరో హిట్‌పై మారుతి నజర్

దసరా పండుగ పూట కుటుంబ కథా చిత్రంగా దర్శకుడు మారుతి మలిచినట్టు ఇప్పటికే ప్రచారం అవుతున్నది. జై లవకుశ, స్పైడర్ చిత్రాలపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్న నేపథ్యంలో మహానుభావుడు చిత్రంపై అందరి నజర్ పడింది. ఒకవేళ ఈ చిత్రానికి సానుకూలమైన స్పందన వస్తే సూపర్ హిట్‌గా నిలిచే అవకాశం ఉంటుంది అనే మెజార్టీ వర్గాల అభిప్రాయం.

 యూవీ క్రియేషన్ సక్సెస్ ఆశలు

యూవీ క్రియేషన్ సక్సెస్ ఆశలు

శతమానం భవతితో సంక్రాంతి బరిలో నిలిచిన శర్వానంద్ మరో హిట్ కొట్టే అవకాశం ఉందని యూవీ క్రియేషన్స్ భావిస్తున్నది. రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా దారిలోనే హిట్ సాధించేందుకు యూవీ క్రియేషన్ సిద్ధమవుతున్నది.

English summary
Mahanubhavudu is an upcoming Telugu-language romantic action comedy film writtem and directed by Maruthi Dasari. It features Sharwanand and Mehreen Pirzada in the lead roles. scheduled for a worldwide release on 29 September 2017.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu