»   » శ్రీకాంత్ అడ్డాలని బ్లేమ్ చేయొద్దు, అది నా తప్పే :మహేష్ బాబు

శ్రీకాంత్ అడ్డాలని బ్లేమ్ చేయొద్దు, అది నా తప్పే :మహేష్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తొలి నుంచీ మహేష్ ఒకటే చెప్తూ వస్తున్నారు. తన సినిమా హిట్ అయితే టీమ్ ఎఫెర్ట్. ఫ్లాఫ్ అయితే తన జడ్జిమెంట్ సమస్య అని. ప్లాఫ్ అయింది కదా అని వేరే వాళ్ల మీదకు తోసేసే మనస్తత్వం కాదు మహేష్ ది. ఇప్పుడు తన తాజా చిత్రం బ్రహ్మోత్సవం డిజాస్టర్ కు కూడా దర్శకుడుని బ్లేమ్ చేయటం అనవసరం అంటున్నారు.

సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటించిన 'బ్రహ్మోత్సవం' సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున గత వారం విడుదలైన విషయం తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూడగా, సినిమా మాత్రం వారిని అనుకున్నంత మేర ఆకట్టుకోలేకపోయింది.

ఈ నేపధ్యంలో అందరూ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలదే తప్పని, ఆయన టీవీ సీరియల్ లాగ తీసారని, మహేష్ నమ్మి మోసపోయారని మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే రిలాక్సేషన్ కోసం ఫ్యామిలీతో కలిసి లండన్ కు వెళ్లిన మహేష్, వెళ్లేముందు తన టీమ్ తో ...తనే ఈ ఫ్లాఫ్ కు భాధ్యత వహిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది.

Mahesh asks Team to stop blaming Addala

అందుతున్న సమాచారం ప్రకారం..మహేష్ తన టీమ్ తో మాట్లాడుతూ...ఫ్లాఫ్ కు శ్రీకాంత్ అడ్డాలని బ్లేమ్ చేయటం అపమని, అదే తన అభిమానులకు సైతం చెప్పమని కోరినట్లు తెలుస్తోంది. అలాగే ఏం జరిగినా, ఎలాంటి అవుట్ పుట్ వచ్చినా అది నా నిర్ణయం మేరకు జరిగిందే. సినిమ ఫ్లాఫ్ అయితే అది నా జడ్జిమెంట్ లోపంతో జరిగింది. అందుకు శ్రీకాంత్ అడ్డాల గారు ఏం చేస్తారు అని మహేష్ చెప్పినట్లు తెలుస్తోంది.

బ్రహ్మోత్సవం కలెక్షన్స్ విషయానికి వస్తే.. స్పెషల్ షో నుంచే నుంచే డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ వీకెండ్ ఓకే అనిపించుకునే కలెక్షన్స్‌నే రాబట్టింది. అయితే సోమవారం నుంచి కలెక్షన్స్ పూర్తిగా నెమ్మదించాయి. ప్రస్తుతం లండన్ లో హాలీడేస్ లో ఉన్న మహేష్ బాబు..జూన్ 20న ఇక్కడకు వచ్చి తన తదుపరి చిత్రం మురగదాస్ తో ప్రారంభిస్తారు.

English summary
Mahesh Babu asked his team to stop blaming Srikanth Addala for Brahmostvam flop. He advised his teammates to convey the same to his fans.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu