»   » హెయిన్స్ అలా అరవగానే భయంవేసింది: మహేష్ బాబు

హెయిన్స్ అలా అరవగానే భయంవేసింది: మహేష్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Mahesh Babu Scared @ Spyder Movie Shooting హెయిన్స్ అలా అరవగానే భయంవేసింది..

తెలుగు, తమిళ్, హిందీ అనే తేడా లేకుండా అన్ని భాషల్లో ఫైట్ మాస్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు పీటర్ హెయిన్స్. రోబో, మగధీర, సెవెంత్ సెన్స్, బాహుబలి-1 వంటి ఇండియన్ బ్లాక్ బస్టర్ సినిమాలకు ఫైట్ మాస్టర్ గా చేసాడు పీటర్ హెయిన్స్.

స్పైడర్ ప్రి రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో చాలా గ్రాండ్‌గా జరిగింది. స్టార్ డైరెక్టర్ మురగదాస్-ప్రిన్స్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ట్రైలర్ ఓ రేంజ్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు తమిళ భాషల్లో ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రి రిలీజ్ ఈవెంట్‌లో మహేశ్ చిత్ర యూనిట్ గురించి మాట్లాడారు. ముఖ్యంగా పీటర్ హెయిన్స్ గురించి మహేష్ చెప్పిన విషయం చాలామందిని ఆకట్టుకుంది.

Mahesh Babu About Fightmaster Peter Heyins

ఈ సందర్భంగా పీటర్ మాస్టర్ గురించి మాట్లాడుతూ "ఒక రోజు నాకు చిత్ర యూనిట్ ఫోన్ చేసి సినిమా షూటింగ్ క్యాన్సిల్ అన్నారు. ఎందుకు? అంటే పీటర్ మాస్టర్‌కి జ్వరం వచ్చిందని చెప్పారు. రెండు రోజుల తర్వాత ఫేస్‌కి మాస్క్‌తో షూటింగ్‌కి హాజరయ్యారు. అరవకుండా మానిటర్ వెనకాలే కూర్చుని తీయాలని పీటర్ మాస్టర్‌కి డాక్టర్ సజెస్ట్ చేశారు. రెండు, మూడు రిహార్సల్స్ చూశాక.. ఏంటి లాగుతున్నారని గట్టిగా అరిచారు. అలా అరవగానే మాకు భయం వేసింది.. కానీ మా సినిమా కోసం లైఫే ఇచ్చారు." అంటూ ఫైట్ మాస్టర్ పీటర్ని అలా ఆకాశానికి ఎత్తేసాడు.

English summary
Tollywood Superstar Mahesh Babu shared a movement with Fightmaster Peter Heyins from Spyder shooting
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu