twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా రెండో మొగుడు అంటూ నమ్రత కామెంట్: మహేష్ బాబు రియాక్షన్ ఇదీ!

    |

    సింగపూర్‌కు చెందిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వారు తయారు చేసిన మహేష్ బాబు వాక్స్ స్టాచ్యూ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లోని 'ఎఎంబి సినిమాస్' థియేటర్లో వైభవంగా జరిగింది.

    మహేష్ బాబు తన భార్య నమ్రత.. పిల్లలు గౌతంకృష్ణ, సితారతో కలిసి హాజరయ్యారు. ఈ విగ్రహావిష్కరణ వేడుక వీక్షించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. ఆవిష్కరణ అనంతరం మహేష్ బాబు మీడియాతో ముచ్చటించారు.

    ఆ కోరిక ఇప్పటికి నిజమైంది

    ఆ కోరిక ఇప్పటికి నిజమైంది

    ఆరేళ్ల క్రితం లండన్లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం సందర్శించాను. అపుడు నా పిల్లలు అక్కడున్న అన్ని వాక్స్ స్టాచ్యూలతో ఫోటోలు దిగారు. ఆ సమయంలో ‘నా విగ్రహం కూడా ఇలా ప్రతిష్టించే రోజు రావాలి' అని కోరుకున్నాను. ఆ కోరిక ఎట్టకేలకు నిజం అయింది. మేడమ్ టుస్సాడ్స్ వారికి ధన్యవాదములు, దీన్ని ఎంతో గౌరవంగా, ఆనందంగా ఫీలవుతున్నట్లు... మహేష్ బాబు తెలిపారు.

    ఇక్కడ ఆవిష్కరించడానికి కారణం అదే

    ఇక్కడ ఆవిష్కరించడానికి కారణం అదే

    ఎప్పుడూ లేని విధంగా హైదరాబాద్‌లో మేడమ్ టుస్సాడ్స్ ఈ విగ్రహావిష్కరణ జరుపడంపై మ్యూజియం ప్రతినిధి అలెక్స్ మాట్లాడుతూ... ఇది మహేష్ బాబు టీమ్ చేసిన సూచన. మహేష్ బాబు ఇండియాలో సూపర్ స్టార్. ఆయనకు భారీగా అభిమానులు ఉన్నారు. అందుకే ఇక్కడ విగ్రహావిష్కరణ చేయడానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు.

    మహేష్ బాబు మేడమ్ టుస్సాడ్స్ స్టాచ్యూ: ఫ్యామిలీతో కలిసి సూపర్ స్టార్ ఫోజులు (ఫోటోస్)

    నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండి పోతుంది

    నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండి పోతుంది

    ఇక్కడ మీ విగ్రహం పక్కన మిమ్మల్ని చూస్తుంటే ట్విన్స్‌ను చూసినట్లు ఉంది. ఈ ప్రపోజల్ వచ్చినపుడు మీరు ఎలా ఫీలయ్యారు? అనే ప్రశ్నకు మహేష్ బాబు స్పందిస్తూ... చాలా సంతోషం అనిపించింది. ఈ విషయంలో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం టీంకు థాంక్స్ చెప్పాలి. నా థియేటర్లో, నా పిల్లల ముందు ఆవిష్కరణ జరుగడం ఇంకా ఆనందంగా ఉంది. ఇంతకంటే గొప్పగా ఏమీ ఉండదని భావిస్తున్నాను. ఈ రోజు నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండి పోతుంది అన్నారు.

    నేనైనా, నా బొమ్మ అయినా ఒకటే

    నేనైనా, నా బొమ్మ అయినా ఒకటే

    ఈ విగ్రహం వల్ల మీ సెల్ఫీలకు డిమాండ్ తగ్గిపోతుందని మీరు భావిస్తున్నారా? అనే ప్రశ్నకు సూపర్ స్టార్ రియాక్ట్ అవుతూ... ‘లేదండీ.. నాకు సెల్ఫీలు వచ్చినా, నా బొమ్మకు సెల్ఫీలు వచ్చినా ఒకటే.' అంటూ సమాధానం ఇచ్చారు.

    20 మంది, ఆరు నెలల హార్డ్ వర్క్

    20 మంది, ఆరు నెలల హార్డ్ వర్క్

    ఈ విగ్రహం తయీరీకి 20 మంది పని చేశారు. ఫైనల్ లుక్ తేవడానికి 6 నెలల సమయం పట్టింది. దీని వెనక చాలా హార్డ్ వర్క్, ఎంతో కేర్ దాగి ఉంది.... అని మ్యూజియం ప్రతినిధి అలెక్స్ తెలిపారు.

    సింగపూర్ వెళ్లాల్సిందే...

    సింగపూర్ వెళ్లాల్సిందే...

    మీ సినిమాల్లో ఈ స్టాచ్యూను చూడొచ్చా? అనే ప్రశ్నకు.... ‘‘లేదండీ, సింగపూర్ వెళ్లి మాత్రమే చూడాలి' అని తెలిపారు. నన్నే ఎందుకు ఎంచుకున్నారు? అనే ప్రశ్నకు నేను ఆన్సర్ చేయలేను, అది మ్యూజియం వారే చెప్పాలని మహేష్ తెలిపారు.

    సెకండ్ హస్బెండ్ అనేసిన నమ్రత

    సెకండ్ హస్బెండ్ అనేసిన నమ్రత

    మీ వాక్స్ స్టాచ్యూ పై ‘సెకండ్ హస్సెండ్ అని నమ్రత కామెంట్' దీనిపై మీ రియాక్షన్ ఏమిటి? అనే ప్రశ్నకు మహేష్ బాబు స్పందిస్తూ... ‘‘అచ్చం నాలాగే ఉండంతో ఇద్దరు మహేష్ బాబులు అనే అర్థం వచ్చేలా నమ్రత ఆ కామెంట్ చేశారే తప్ప మరేమీ లేదు' అన్నారు.

    శ్రీమంతుడు మూవీ హెయిర్ స్టైల్

    శ్రీమంతుడు మూవీ హెయిర్ స్టైల్

    ఈ విగ్రహానికి ‘శ్రీమంతుడు' సినిమాలో మాదిరిగా హెయిర్ స్టైల్ చేసినట్లు మహేష్ బాబు తెలిపారు. ఈ సినిమా మాత్రమే కాదు... తాను చేసిన అన్ని సినిమాల్లోని లుక్ పరీశీలించి ది బెస్ట్ లుక్ సెలక్ట్ చేసి ఈ విగ్రహానికి అప్లై చేసినట్లు తెలిపారు.

    English summary
    Mahesh Babu's wax statue unveiled in Hyderabad; The ONLY figurine brought by Madame Tussauds to India. Mahesh Babu's statue has been brought to Hyderabad and has been placed at the AMB cinemas. Post this event, the wax statue will be taken back to Singapore and will be opened for public display.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X