»   » రివ్యూలపై వివాదాలు: ఎన్టీఆర్‌‌కు మహేష్ బాబు కౌంటర్?

రివ్యూలపై వివాదాలు: ఎన్టీఆర్‌‌కు మహేష్ బాబు కౌంటర్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ మధ్య కొందరు హీరోలు సినిమా రివ్యూ రైటర్లపై ప్రెస్ మీట్లలో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. సినిమాలోని లోపాలను ఎత్తి చూపితే సహించలేక పోతున్నారు. ఇటీవల 'జై లవ కుశ' ప్రెస్ మీట్లో ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ అందరినీ విస్తుపోయేలా చేశాయి. రివ్యూ రైటర్లను ఎమర్జెన్సీ వార్డులోనే సినిమాను చంపేస్తున్న దానయ్యలుగా అభివర్ణించిన సంగతి తెలిసిందే.

'స్పైడర్' మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న మహేష్ బాబుకు రివ్యూల వివాదానికి సంబంధించి ప్రశ్న ఎదురైంది. దీనిపై మహేష్ బాబు తనదైన రీతిలో స్పందించారు. ఇలాంటి వివాదాలు ఎందుకు వస్తున్నాయో తెలియడం లేదన్నారు.

సింపుల్ లాజిక్ చెప్పిన మహేష్

సింపుల్ లాజిక్ చెప్పిన మహేష్

ఈ వివాదానికి సంబంధించిన విషయమై నేను ఎటువంటి కామెంట్స్ చేయలేను. నిజం చెప్పాలంటే.. నేను కూడా రివ్యూస్ చదువుతున్నాను. సినిమా బాగుంటే బాగా రాస్తున్నారు, బాగుండకపోతే బాగా రాయట్లేదు. సింపుల్ సింపుల్ లాజిక్. ఇంతకన్నా వివరించి నేను చెప్పలేను.... అని మహేష్ బాబు అన్నారు.

Jai Lava Kusa Success Meet : NTR counters film critics strongly
స్పైడర్ మూవికి మంచి రివ్యూస్ వస్తాయని

స్పైడర్ మూవికి మంచి రివ్యూస్ వస్తాయని

‘స్పైడర్' సినిమా బాగుంటుంది. చాలా మంచి రివ్యూస్ వస్తాయని నేను భావిస్తున్నాను. తమ సినిమా అన్ని వర్గాలకు నచ్చేలా ఉంటుందని, సినిమాపై పూర్తి నమ్మకం ఉందని మహేష్ బాబు చెప్పుకొచ్చారు.

మహేష్ బాబు సేఫ్‌గా

మహేష్ బాబు సేఫ్‌గా

వివాదాస్పద ప్రశ్నకు సంబంధించి మహేష్ బాబు సేఫ్ గేమ్ ఆడారు. ఇటు రివ్యూ రైటర్లను నొప్పించకుండా, అంటు విమర్శలు చేసిన హీరోలను టార్గెట్ చేయకుండా తనకు ఏమీ తెలియదంటూ మాట దాటవేశారు.

ఎవరి వాదన వారిదే...

ఎవరి వాదన వారిదే...

సినిమా రివ్యూల విషయంలో ఎవరి వాదన వారిదే. సినిమా రంగానికి చెందిన వారు సినిమాలోని లోపాలను ఎత్తిచూపుతూ రివ్యూలు రాయడాన్ని తప్పబడుతున్నారు. బయటి వారు మాత్రం సినిమా బావుంటే ఆడుతుంది, బాగోలేక పోతే ఆడదు.... రివ్యూల ఆధారంగా సినిమాలు నడవటం, నడవక పోవడం ఉండదు.

English summary
"We have been hearing about many controversies, but I can't comment on them. To be frank, Even I have been going through the Reviews. Good Films have been receiving Positive Reviews & Bad Films are getting Negative Reviews. It's a simple logic! I can't explain more." Mahesh Babu about reviews controversies.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu