నాన్న కూచి సితార: మహేష్ బాబును చూసి అసూయపడతారేమో? (ఫోటోస్)
హైదరాబాద్: మహేష్ బాబు పర్‌ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్.... కాదు కాదు కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్. ఆయనకు సినిమాలు, వాణిజ్య ప్రకటనల్లో నటించడం, మిగతా సమయం ఫ్యామిలీతో గడపడం తప్ప మరొకటి తెలియదు అంటే అతిశయోక్తి కాదేమో!
ముఖ్యంగా పిల్లలతో ఆయన బాండింగ్, ఎక్స్‌స్పెషల్లీ తన చిన్నారి కూతురు సితారతో మహేష్ బాబు ఎటాచ్మెంట్ చూస్తే ఎవరైనా అసూయపడక తప్పదు. ఇతర స్టార్ హీరోలెవరూ మహేష్ బాబు లాగా ఫ్యామిలీకి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వరేమో అనేలా మహేష్ బాబు లైఫ్ స్టైల్ ఉంటుంది.
షూటింగులకు వెళ్లడం, ఈవినింగ్ చీకటిపడేలోపే ఇల్లు చేయడం...పిల్లలు, కుటుంబంతో గడపడం, షూటింగ్ లేకుంటే విదేశాల్లో ఫ్యామిలీ ట్రిప్ వేయడం తప్ప మరే ఎక్స్‌ట్రా లాక్టివిటీస్ లేవు ఆయనకు. ఈ మధ్యే ఆయన సొంతగా ప్రొడక్షన్ స్థాపించినా అందకు సంబంధించిన వ్యవహారాలన్నీ ఆయన భార్య నమ్రతే చూసుకుంటున్నారు.
బ్రహ్మోత్సవం షూటింగ్ తర్వాత సమ్మర్ కావడంతో మహేష్ బాబు ఈ సారి ఫ్యామిలీతో దాదాపు నెల రోజుల పాటు యూరఫ్ ట్రిప్ వేసారు. ఇటీవలే ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో మహేష్ బాబు సితారను తన భుజాల మీద ఎత్తుకుని వెలుతున్న ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
సితార చిన్న తనం నుండి నాన్న కూచి. అఫ్ కోర్స్ కూతుర్లంతా చిన్నతనంలో నాన్న వద్దే ఎక్కువగా గారాలు పోతారనుకోండి. కానీ సితార-మహేష్ బాబు బాండింగ్ చూస్తే మాత్రం ఇంత గారాబంగా తమకూతుళ్లను ఎవరూ చూసుకోరేమో అనే సందేహం రాక మానదు.

మహేష్ బాబు-సితార
ఇటీవల యూరఫ్ ట్రిప్ ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న మహేష్ బాబు ఎయిర్ పోర్టులో కూతురుతో ఇలా కెమెరాకు చిక్కారు.

సితార
సితారన చిన్న తనం నుండి నాన్న కూచి....

ఆడియో పంక్షన్లో..
ఇటీవల జరిగిన ఓ ఆడియో ఫంక్షన్లో మహేష్ బాబు, సితార..

సితార చిన్నతనంలో...
1-నేనొక్కడు సినిమా షూటింగ్ సమయంలో సితార....

అల్లరి పిల్ల..
ఇంట్లో గౌతం కంటే సితారే ఎక్కువ అల్లరి చేస్తుందట.

ఫ్యామిలీ ఫంక్షన్ లో...
ఇటీవల ఓ ఫ్యామిలీ ఫంక్షన్లో మహేష్, సితార...

ఇట్టే కలిసి పోతుంది
మహేష్ బాబు సినిమా షూటింగులు అప్పుడప్పుడు సితార కూడా వెలుతుంటుంది. అక్కడ ఇరత స్టార్లతో సితార ముచ్చట్లు చూస్తే ముచ్చేస్తుంది.

హీరోయిన్ అవుతుందా?
ఇటీవల సమంత సితార గురించి మాట్లాడుతూ ఫ్యూచర్లో హీరోయిన్ అవుతుంది అని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











