»   »  వివాదం చెక్ చెప్పటానికేనా మహేష్ బాబు ఈ హఠాత్తు ప్రకటన?

వివాదం చెక్ చెప్పటానికేనా మహేష్ బాబు ఈ హఠాత్తు ప్రకటన?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ బాబుతో చిత్రం విషయమై దర్శకుడు వంశీ పైడిపల్లి, పివీపి మధ్య విభేధాలు చోటు చేసుకుని హై కోర్టుదాకా వెళ్లిన సంగతి తెలిసిందే. దాంతో మహేష్ బాబు ...సినిమా ఏ నిర్మాత, దర్శకుడుతో చేస్తాడు..దానికి ముగింపు ఏమిటి అన్న చర్చ మొదలైంది.

కానీ మహేష్ బాబు డైరక్ట్ గా ఆ విషయం ఎత్తకుండా...నేను చేయబోయే చిత్రాల దర్శకులు,నిర్మాతలు అంటూ ఓ లిస్ట్ విడుదల చేసారు. సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన ఈ లిస్ట్ లో వంశీ పైడిపల్లి చిత్రం గురించి కూడా ఉండటం గమనించవచ్చు.


న్యూ ఇయిర్ సందర్బంగా చేసిన ఈ ట్వీట్ ప్రకటనలో ...మొదటి చిత్రం కొరటలా శివతో దానయ్య నిర్మాతగా ఉండనుంది. అలాగే రెండో చిత్రం వంశీ పైడిపల్లితో దిల్ రాజు, అశ్వనీదత్ సినిమా ఉండనుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ వారితో చేసే సినిమా. ఇలా మూడు ప్రాజెక్టులు అఫీషియల్ గా ప్రకటించాడు.
Mahesh Babu announces three movies

ఇలా ఇంతకు ముందు ఎప్పుడూ మహేష్ బాబు ప్రాజెక్టులు ట్విట్టర్ ద్వారా ప్రకటించలేదు. ఇలా హఠాత్తుగా ప్రకటన చేయటానికి కారణం..తాను వంశీ పైడిపల్లితోనే ఉన్నానని, అశ్వనీదత్, దిల్ రాజు లకు సినిమా చేయబోతున్నానని చెప్పటానికి అంటున్నారు.

ఇక ప్రస్తుతం మహేష్ బాబు ప్రముఖ తమిళ దర్శకుడు ఎఆర్ మురగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. జనవరి నెలాఖరుకి షూటింగ్ పూర్తి అవుతుందని భావిస్తున్నారు. ఈ సినిమా విషయమై మహేష్ చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు.

అలాగే ప్రస్తుతం న్యూ ఇయర్ హాలీడే లో ఉన్న మహేష్ ఈ వారంలో తిరిగొచ్చి జనవరి 7 నుండి మురుగదాస్ తో చేస్తున్న సినిమా యొక్క కొత్త షెడ్యూల్ మొదలుపెట్టనున్నాడు.

ఈ సంవత్సరం తన కెరీర్లో ఎక్సయిటింగా ఉండనుందని మహేష్ సంతోషం వ్యక్తం చేశాడు.

ప్రస్తుతం మహేష్ బాబు మురగదాస్ సినిమాతో బిజిగా ఉన్నాడు. ఈ చిత్రం మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జతకట్టనుంది. ఇప్పటికే 40శాతం పైగా షూటింగ్ పూర్తయ్యింది. ఈ చిత్రాన్ని జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం తర్వాత మహేష్ మళ్లీ దర్శకుడు కొరటాల శివతో జతకట్టనున్నాడు. ఇప్పటికే 'శ్రీమంతుడు' మహేష్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు కొరటాల. ఇప్పుడు మహేష్ కోసం మరో అద్భుతమైన కథని రెడీ చేశాడట. ఇందులో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడంటూ ప్రచారం జరుగుతోంది.

కొరటాల చిత్రం తర్వాత వంశీ పైడిపల్లి చిత్రంలో మహేష్ నటించనున్నాడు. వంశీ చిత్రాన్ని కూడా ప్రిబ్రవరి లేదా మార్చిలో మొదలెట్టేందుకు మహేష్ రెడీ అవుతున్నట్టు సమాచారమ్. మురగదాస్, కొరటాల, వంశీ పైడిపల్లి లతో చేయబోయే సినిమాలని 2017 రిలీజ్ చేసిందుకు ప్రిన్స్ ప్లాన్ చేస్తున్నాడు. ఇదిగాక, పూరి చిత్రాన్ని కూడా ఇదే యేదాది పట్టాలెక్కించనున్నాడు. మొత్తానికి మహేష్ జెడ్ స్పీడుతో సినిమాలు చేసేందుకు రెడీ అయినట్టు కనబడుతోంది.

English summary
Superstar Mahesh Babu took twitter to wish his fans and also shared the line up of his next movies.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu