మహేష్ బాబు ఎవరికి ‘ఎనిమీ’గా మారుతున్నాడు?
హైదరాబాద్: బ్రహ్మోత్సవం చిత్రం షూటింగ్ లో బిజిగా ఉన్న మహేష్ దీని తర్వాత ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగుదాస్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. బ్రహ్మోత్సవం పూర్తయిన వెంటనే కొన్ని రోజుల గ్యాప్ తో సినిమా సెట్స్ పైకి వెళుతుంది.
ఈ సినిమాకు సంబందించిన బౌండెడ్ స్క్రిప్ట్ పూర్తి చేసి మురుగుదాస్ రెడీగా ఉన్నారు. మూడు భాషల్లో రూపొందనున్న ఈ చిత్రం ఏప్రిల్ తర్వాత ప్రారంభం అవుతుందని టాక్. నిర్మాతలు ఎన్.వి ప్రసాద్ మరియు ఠాగుర్ మధు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా కు సుమారు 110 కోట్లు ఖర్చుపెడుతున్నట్టు సమాచారం.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.... ఈ చిత్రానికి ‘ఎనిమీ'(శత్రువు) అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. గతంలో ‘చట్టంతో పోరాటం' అనే టైటిల్ అనుకున్నప్పటికీ అది అంత అట్రాక్టివ్ గా లేక పోవడంతో ‘ఎనిమీ' టైటిల్ ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

భారతీయ న్యాయ వ్యవస్థలోని లోపాలను ప్రశ్నిస్తూ ఈ సినిమా ఉంటుందని టాక్. సోషల్ రెస్పాన్సిబులిటీతో సినిమాను సందేశాత్మకంగా తెరకెక్కించబోతున్నారట. చట్టంలోని లోపాలను అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడే వారికి ‘ఎనిమీ'గా మహేష్ బాబు పాత్ర ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన లోకేషన్స్ కోసం మురుగుదాస్, కెమెరామెన్ సంతోష్ శివన్ ముంబాయి పరిసర ప్రాంతలు తిరుగుతున్నారు. ఇది ముంబాయ్ బ్యాక్ డ్రాప్ లో కథ ఉంటుందని ఫిల్మ్ నగర్ సమాచారం.
ఈ సినిమాలో విలన్‌గా హాలీవుడ్ యాక్టర్ నటించబోతున్నట్లు సమాచారం. హాలీవుడ్ నటుడు హారిసన్ ఫోర్డ్ ఈ చిత్రంలో విలన్ గా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. హాలీవుడ్ నుండి వస్తున్నాడు కాబట్టి అతడికి కెమ్యూనరేషన్ కూడా భారీగానే ముట్టజెబుతున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











