»   » మహేష్ బాబు సినిమాకు బడ్జెడ్ మరింత పెంచారు

మహేష్ బాబు సినిమాకు బడ్జెడ్ మరింత పెంచారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్లో ఓ సినిమా ప్రారంభం కాబోతున్నసంగతి తెలిసిందే. మహేష్ బాబు బ్రహ్మోత్సవం తర్వాత చేయబోయే సినిమా ఇది. మహేష్ కెరీర్లోనే ఇప్పటి వరకు ఎన్నడూ లేనంతగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు.

రూ. 80 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించాలని గతంలో అంచనా వేసారు. అయితే ప్రీప్రొడక్షన్ వర్క్ పూర్తయిన తర్వాత రూ. 90 కోట్ల ఖర్చవుతాయని తేల్చారట. షూటింగ్ ఇంకా మొదలు కాలేదు షూటింగ్ పూర్తయ్యేలోపు బడ్జెట్ రూ. 100 కోట్లను టచ్ అయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.

ప్రస్తుతం ఈ ప్రాజెక్టు గురించి ఎలాంటి ఎలాంటి హడావుడి లేక పోయినా.... దర్శకుడు మురుగదాస్ సైలెంటుగా తన పని చక చకా చేసుకబోతున్నాడట. ఈ చిత్రానికి సంతోష్ శివన్, హారిస్ జైరాజ్ లాంటి టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు.

 Mahesh Babu & AR Murugadoss movie Budget hike

బహుశ ఈ సినిమాను ఉగాదికి లాంచ్ చేసే అవకాశం కనబడుతోంది. అలాగే...ఏప్రియల్ రెండవ వారం నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని సమచారం. హీరోయిన్ ఇంకా ఫైనల్ కాక పోయినా శృతి హాసన్ ను తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.

ప్రస్తుతం మహేష్ బాబు బ్రహ్మోత్సవం షూటింగులో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ వేగంగా జరుగుతోంది.

English summary
Mahesh Babu & AR Murugadoss untitled movie is already one of the most-awaited films of 2016. There is news about Rs 80 crore being spent on Mahesh-Murugadoss flick. As per latest buzz, The total budget has been increased by Rs 10 crore even before beginning the shoot. At a whooping Rs 90 crore.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu