»   » ఖైరతా‌బాద్ ఆఫీసులో మహేష్ బాబు సందడి

ఖైరతా‌బాద్ ఆఫీసులో మహేష్ బాబు సందడి

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ సూపర్ స్టార్ మ‌హేష్ బాబు శుక్రవారం హైద‌రాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ లో సందడి చేశారు. తన కొత్త కార్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు మహేష్ బాబు స్వయంగా కారు నడుపుకుంటూ వచ్చారు. అధికారులు ఇచ్చిన ద‌ర‌ఖాస్తుల‌పై సంత‌కం చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. రిజిస్ట్రేష‌న్ కోసం వేలిముద్ర‌లు ఇచ్చి ఫొటో దిగారు.

రిజిస్ట్రేషన్ అనంతరం మహేష్ బాబు 'స్పైడర్' ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు బయల్దేరి వెళ్లిపోయారు. హైదరాబాద్‌లోని శిల్ప‌క‌ళా వేదిక‌లో స్పైడర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్‌గా జరుగుతోంది. మురుగదాస్ తెర‌కెక్కించిన‌ ఈ సినిమాలో మ‌హేష్ బాబుకి జోడీగా ర‌కుల్ ప్రీత్ సింగ్ నటించింది.

Mahesh Babu At RTA khairatabad Office

సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం 'స్పెడర్‌'. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం దసరా కానుకగా సెప్టెంబర్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

మహేష్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ఎస్‌.జె.సూర్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేరిస్‌ జయరాజ్‌, సినిమాటోగ్రఫీ: సంతోష్‌ శివన్‌ ఎఎస్‌సి.ఐఎస్‌సి, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రూపిన్‌ సుచక్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్‌, సమర్పణ: ఠాగూర్‌ మధు, నిర్మాత: ఎన్‌.వి.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్‌.మురుగదాస్‌.

English summary
Tollywood Most handsome Hero Mahesh babu went to RTA office at khiarathabad on 15th September, 2017.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X