»   » మహేష్ బాబు వల్లే బాలీవుడ్ ఆఫర్ వచ్చిందన్న క్రిష్

మహేష్ బాబు వల్లే బాలీవుడ్ ఆఫర్ వచ్చిందన్న క్రిష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్దురుమ్ చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ క్రిష్. తర్వాత బాలీవుడ్లో అక్షయ్ కుమార్ హీరోగా ‘గబ్బర్' చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం దక్కించుకుని సక్సెస్ అయ్యాడు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన మరో చిత్రం ‘కంచె' ఈ నెల 22న విడుదలకు సిద్ధమవుతోంది.

మహేష్ బాబుతో కూడా క్రిష్ ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ పలు కారణాలతో ఈ సినిమా ప్రారంభం కాలేదు. అదే సమయంలోనే అతడికి బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ నుండి పిలుపు వచ్చింది. తెలుగులో సూపర్ హిట్టయిన ‘ఠాగూర్' చిత్రాన్ని క్రిష్ దర్శకత్వంలో ‘గబ్బర్' చిత్రంగా తెరకెక్కింది. అక్షయ్ కుమార్ కెరీర్లో ఈచిత్రం ఎబో యావరేజ్ గ్రాసర్ గా నిలిచింది.

Mahesh Babu Behind Gabbar Offer

మహేష్ బాబు, నమ్రత వల్లే తనకు బాలీవుడ్ మూవీ ‘గబ్బర్' చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం దక్కిందని అంటున్నాడు క్రిష్. ఆ చిత్రానికి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన సబీనా ఖాన్ కు తన పేరును రికమండ్ చేసింది నమ్రత, మహేష్ బాబే అంట. ఈ విషయాన్ని క్రిష్ స్వయంగా వెల్లడించారు.

తన తాజా సినిమా ‘కంచె' చిత్రానికి కూడా మహేష్ బాబు సపోర్టుగా నిలిచాడు. కంచె సినిమా టీజర్ విడుదలైన తర్వాత చాలా బావుందంటూ ట్వీట్ చేసారు. చరణ్, బన్నీ, ఎన్టీఆర్, రాజమౌళి తదితరులు కూడా కంచె చిత్రం టీజర్ అదిరిపోయిందంటూ ప్రశంసించారు. దీంతో ‘కంచె' సినిమాపై కూడా అంచనాలు భారీగా పెరిగాయి.

Mahesh Babu Behind Gabbar Offer

వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కంచె' చిత్రం ఈ నెల 22న దసరా కానుకగా విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని యూఎస్ఏలో భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 130కి పైగా స్క్రీన్లలో విడుదల చేస్తున్నారు. అక్కినేని అఖిల్ నటిస్తున్న ‘అఖిల్' చిత్రం దసరా బరి నుండి తప్పుకోవడంతో ఆ స్థానంలో అక్టోబర్ 22న వరుణ్ తేజ్ సినిమా ‘కంచె' విడుదలవుతోంది. వాస్తవానికి అక్టోబర్ 2నే విడుదల కావాల్సిన ఈ చిత్రం అనుకోని కారణాలతో నవంబర్ 6కు వాయిదా పడింది. అయితే పరిస్థితులు కలిసి రావడంతో అనుకున్న దానికంటే ముందే కంచె రిలీజ్ అవుతోంది.

తెలుగు సినీ పరిశ్రమలో తొలిసారిగా రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమా ‘కంచె'. ట్రైలర్ విడుదలైనప్పటి నుండే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్ గా చేస్తోంది.

English summary
Krish who is presently busy with promotions of his next Telugu attraction Kanche starring Varun Tej and Pragya Jaiswal stated, "Mahesh Babu and Namrata were the reason for me getting Bollywood film Gabbar Is Back. They had recommended my name to co-producer Shabinaa Khan for the film. Mahesh also tweeted about Kanche, after the film's teaser got released. Likewise, Charan, Bunny, NTR and Rajamouli also phoned me to praise the teaser."
Please Wait while comments are loading...