»   »  థియేటర్ కొనుగోలు చేసిన మహేష్ బాబు, ఎన్ని కోట్లకి?

థియేటర్ కొనుగోలు చేసిన మహేష్ బాబు, ఎన్ని కోట్లకి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ మహేష్ బాబు ఓ వైపు స్టార్ హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ, పలు కార్పొరేట్ బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ టాలీవుడ్లో హయ్యెస్ట్ సాంపాదన కలిగిన స్టార్ గా రికార్డుల్లో కెక్కాడు. ఇదే కాక మహేష్ బాబు ఇటీవల సినిమా నిర్మాణ రంగంలోకి కూడా అడుగు పెట్టారు.

మహేష్ బాబు ఎంటర్టెన్మెంట్స్ పేరుతో సొంతగా బేనర్ స్థాపించారు. తాజాగా మరో బిజినెస్ లోకి కూడా మహేష్ బాబు అడుగు పెట్టినట్లు సమాచారం. ఈ మధ్య హైదరాబాద్ తో సహా అన్ని నగరాల్లో మల్టీప్లెక్సులదే ఫుల్ హవా... ఈ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లో మహేష్ కూడా ఓ థియేటర్ కొనుగోలు చేసినట్లు సమాచారం.

Mahesh Babu Bought A Theatre

గచ్చిబౌలిలో కొత్తగా నిర్మిస్తున్న ‘ప్రిస్టన్ ప్రైమ్ మాల్‌'లోని నాలుగు స్క్రీన్లలో ఓ థియేటర్ కొన్నట్లు సమాచారం. ఇందుకోసం మహేష్ బాబు రూ. 12 కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం. మహేష్ ఇలా థియేటర్ కొనుగోలు చేయడం వెనుక భార్య నమ్రత ప్రోత్సాహమే ఎక్కువట. ప్రస్తుతం టాలీవుడ్లో థియేటర్లు గుప్పెట్లో ఉన్న పెద్ద నిర్మాతల హవా నడుస్తోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులను దృష్టిలో పెట్టుకుని మహేష్ బాబు ఇకపై వీలైనన్ని థియేటర్లు కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

మహేష్ బాబు తాజా సినిమా బ్రహ్మోత్సవం వివల్లోకి వెళితే...శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రాన్ని పి.వి.పి సినిమా పతాకంపై పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్‌ ముగ్గురు భామలతో ఆడిపాడనున్నారు. సమంత, కాజల్‌ అగర్వాల్‌, ప్రణీత హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్‌ స్వరాలందిస్తున్నారు. గతంలో మహేష్ బాబు - శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా కూడా కుటుంబ భావోద్వేగాల నేపధ్యంలో సిద్దం అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. అదే సెంటిమెంట్ ని ఈ సారి కూడా రిపీట్ చేయనున్నారు.

English summary
As per reliable sources Mahesh bought a screen in Preston Prime Mall located in Gachibowli, Hyderabad.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu