»   » మహేష్ ఫ్యామిలీ నుంచి మరో హీరో..చిత్రం ప్రారంభం

మహేష్ ఫ్యామిలీ నుంచి మరో హీరో..చిత్రం ప్రారంభం

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్ బాబు మేనత్త కొడుకు(వరసకు భావమరిది)సుధీర్ హీరోగా రూపొందుతున్న 'యస్ యం యస్' చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం రామానాయుడు స్టుడియోలో ప్రముఖుల సమక్షంలో జరిగింది. ఈ చిత్రాన్ని సూపర్ గుడ్ ఫిల్మ్స్,హనిబీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లు సంయుక్తంగా రుపొందిచనున్నాయి. ఆర్ బి చౌదరి సమర్పణలో ఘట్టమనేని ప్రియ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భీమిలి కబడ్డీ జట్టు ఫేం తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సందర్భంగా ముహూర్తపు సన్నివేశానికి సూపర్ స్టార్ కృష్ణ క్లాప్ ఇవ్వగా, డా. డి రామానాయుడు కెమెరా స్విచ్ ఆన్ చేసారు. నటి, దర్శకురాలు విజయనిర్మల గౌరవ దర్శకత్వం వహించారు.ఇక సుధీర్ ఇంతకుముందు ఏమి మాయ చేసావే చిత్రంలో సమంతకు బ్రదర్ గా చేసాడు.

తరవాత పాత్రికేయుల సమావేశంలో నిర్మాత ఆర్ బి చౌదరి మాట్లాడుతూ' ఈ చిత్రాన్ని యస్ యం యస్ అనే తమిళ చిత్రానికి రీమేక్ గా రుపొందిస్తున్నాం. ఈ చిత్రం ద్వార సుదీర్, రేజినా లను హీరో హీరోయిన్ లుగా పరిచయం చేస్తున్నాం. తమిళం లో లానే తెలుగులో కూడా సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను 'అన్నారు. హీరో సుదీర్, దర్శకుడు సత్య సినిమా విజయం సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేసారు. కధానాయకి రేజినా తనకు అవకాశం ఈ కల్పించినందుకు దర్శక నిర్మాతలకు కృతఙ్ఞతలు తెలియజేసుకుంది. నరేష్, రోహిణి, హర్షవర్ధన్, ప్రియాంక తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నా ఈ చిత్రానికి కధ: రాజేష్, తాతినేని సత్య, మాటలు:నంద్యాల రవి, కెమెరా: చిట్టిబాబు, సంగీతం: సెల్వ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రవీంద్ర రానా

English summary
One more hero is making his debut from Mahesh Babu family! Posani Sudhir, brother in law of Mahesh and third son in law of Krishna is turning a hero with Tatineni Satya's movie. Mega Super Good Movies will produce this movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu