»   » మొత్తానికి మహేష్ ని ఒప్పించారు

మొత్తానికి మహేష్ ని ఒప్పించారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ బాబు కెరీర్ ప్రారంభం నుంచి కొన్ని నియమాలతో ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగా అన్నట్లు ఆయన ఎప్పుడీూ ఏ సినిమాలోనూ గెస్ట్ రోల్ లో కనిపించలేదు. చాలా మంది గతంలో ఈ గెస్ట్ రోల్ విషయమై మహేష్ ని సంప్రదించి, కుదరక ఒప్పించలేక వదిలేసారు. అయితే తన బావకోసం తన నియమాన్ని ఆయన సడలించుకున్నట్లు తెలుస్తోంది. సుధీర్‌బాబు హీరోగా తెరకెక్కుతోన్న 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' చిత్రంలో మహేష్‌ ఓ ముఖ్య పాత్ర పోషించనున్నారు.

మహష్‌బాబు ఇప్పటి వరకు 'జల్సా', 'బాద్‌షా' చిత్రాల్లో తన గొంతునే వినిపించారు. తొలిసారి ఓ చిత్రంలో అతిధిగా అలరించనుండటం ఆసక్తి కలిగించే అంశమే. ''ఈ చిత్రంలో మహేష్‌బాబు పాత్ర ప్రత్యేకంగా, ఆసక్తిగా ఉంటుంది. ఆయన కథ చెప్పగానే నటించడానికి అంగీకరించారు. ఆయన ఈ చిత్రాన్ని అంగీకరించడంలో సుధీర్‌బాబుది కీలక పాత్ర. మహేష్‌ అభిమానులకు నచ్చేలా ఆయన పాత్ర ఉంటుంది'' అని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.

Mahesh Babu cameo in 'Krishnamma Kalipindi Iddarini'

ప్రస్తుతం మహేష్‌ 'ఆగడు' చిత్రంతో బిజీగా ఉన్నారు. మరో పది రోజుల్లో 'కృష్ణమ్మ కలిపింది...' చిత్రంలో మహేష్‌బాబుకి సంబంధించిన సన్నివేశాల్ని చిత్రీకరిస్తారని తెలిసింది. ఈ చిత్రంలో నందిత హీరోయిన్ . కన్నడంలో ఘనవిజయం సాధించిన 'చార్మినార్'కి ఇది రీమేక్. రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్, శిరీష ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కన్నడ వెర్షన్‌కి దర్శకుడైన ఆర్. చంద్రు తెలుగు వెర్షన్‌నీ డెరైక్ట్ చేయబోతున్నారు.

సుధీర్‌ బాబు మాట్లాడుతూ ''ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నీ వినోద ప్రధానమైనవే. ఈ సినిమా వాటికి భిన్నంగా పాత రోజుల్ని గుర్తు చేసేలా ఉంటుంది'' అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ''కుటుంబం, స్నేహితులు, ప్రేమ.. ఈ అంశాల మధ్య కథ నడుస్తుంది. కృష్ణమ్మకు సినిమాకు సంబంధమేంటనేది తెరపై చూడాల్సిందే'' అన్నారు. సినిమాలో గిరిబాబు, ఎమ్మెస్‌ నారాయణ, సారిక రామచంద్రరావు, చిట్టిబాబు, కిషోర్‌దాస్‌, అభిజిత్‌ తదితరులు ఇతర పాత్రధారులు. సంగీతం: హరి, మాటలు: ఖదీర్‌బాబు, ఛాయాగ్రహణం: కె.ఎస్‌.చంద్రశేఖర్‌, కళ: నారాయణరెడ్డి

English summary
Mahesh Babu, who is busy wrapping up Telugu actioner "Aagadua", will be seen in a cameo role in upcoming Telugu film "Krishnamma Kalipindi Iddarini", starring his brother-in-law Sudheer Babu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu