»   » అరేబియన్ సీ తీరంలో టెర్రరిస్ట్ ల కోసం మహేష్ బాబు..

అరేబియన్ సీ తీరంలో టెర్రరిస్ట్ ల కోసం మహేష్ బాబు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్ బాబు, సమంతా హీరో హీరోయిన్లుగా, శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న 'దూకుడు' సినిమా తాజా షెడ్యులు షూటింగు గుజరాత్ లోని అరేబియన్ సీ తీరంలోని కచ్ ప్రాంతంలో జరుగుతోంది. ఫిబ్రవరి ఫస్ట్ నుంచి జరుగుతున్న ఈ షూటింగులో ఓ పాటతో బాటు కొన్ని సీన్స్ ను కూడా చిత్రీకరిస్తున్నారు. హీరో హీరోయిన్లతో బాటు ముఖ్య తారాగణం కూడా ఈ షూటింగులో పాల్గొంటున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు పోలీస్ ఆఫీసరుగా నటిస్తున్నాడు. పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకుపోయిన ఓ టెర్రరిస్టును పట్టుకునే ప్రయత్నంలో హీరో పలు ప్రాంతాలకు వెళతాడు. వాటికి సంబంధించిన కొన్ని సీన్స్ నే ఇప్పుడు గుజరాత్ లో షూట్ చేస్తున్నారు. ఇంతకు ముందు టర్కీ, దుబాయ్, మలేసియా, హైదరాబాదులో కొంత భాగం షూటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. తమన్ దీనికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu