»   » రాజమౌళి దర్శకత్వంలో ఎప్పుడంటే...: మహేష్ బాబు

రాజమౌళి దర్శకత్వంలో ఎప్పుడంటే...: మహేష్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సెన్సేషన్ సినిమాల దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా అంటే సినీ ప్రేమికుల్లో ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. ఇక మహేష్, రాజమౌళి కాంబినేషన్లో సినిమా అంటే అంచనాలు అవధులు దాటి పోవడం ఖాయం. ఇది త్వరలోనే జరిగే అవకాశముందని మహేష్ బాబు చెప్తున్నారు. ఆయన నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. హైదరాబాద్‌లో మహేష్‌ మీడియాతో ముచ్చటించారు.


మహేష్ మాట్లాడుతూ ''శ్రీనువైట్ల దర్శకత్వంలో 'ఆగడు' సినిమా వచ్చే నెలలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత క్రిష్‌, వంశీ పైడిపల్లి, పూరి జగన్నాథ్‌ల దర్శకత్వంలో సినిమాలు చేస్తా. అవి పూర్తయ్యాక రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుంది. కథ గురించి ఇదివరకే మాట్లాడుకొన్నాము''అని తెలిపారు.

అలాగే ... సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గురించి చెబుతూ ''సహజత్వంతో కూడిన కథ ఇది. యాక్షన్‌ నేపథ్యంలో సాగుతుంది. సుకుమార్‌ ఇదివరకు చేసిన చిత్రాలకి భిన్నంగా ఉంటుంది. ఈ సినిమాకి ఇంకా పేరు నిర్ణయించలేదు. జూన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు.

ఇక ''విశ్వరూపం' వివాదాల్లో చిక్కుకోవడం దురదృష్టకరం. కమల్‌హాసన్‌కి నేను వీరాభిమానిని. అంత పెద్ద నటుడు కంటతడి పెట్టడం చాలా బాధనిపించింది''అన్నారు మహేష్‌బాబు. ఆయన మాట్లాడుతూ ''కమల్‌హాసన్‌ నటించిన 'విశ్వరూపం' చిత్రాన్ని నేను ఇంకా చూడలేదు. ఆ సినిమాకి ఎదురైన అడ్డంకులన్నీ తొలగిపోవాలని కోరుకొంటున్నాను''అన్నారు.

English summary

 
 Mahesh Says..."I will work with Rajamouli for sure. I even had a meeting with him about this. Both of us are excited about the prospect of working together. But we have our respective projects to complete first. Once they are done, we will start off".
Please Wait while comments are loading...