»   » ‘మగధీర’ను టార్గెట్ గా పెట్టుకొన్న‘పోకిరి’

‘మగధీర’ను టార్గెట్ గా పెట్టుకొన్న‘పోకిరి’

Posted By:
Subscribe to Filmibeat Telugu

'పోకిరి" హిట్ తో తను నెలకొల్పిన రికార్డులన్నీ 'మగధీర" తుడిచి పెట్టేయడంతో మళ్లీ నంబర్ వన్ హిట్ కొట్టాలనే కసితో వున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. మూడేళ్ల విరామం తర్వాత వస్తున్న తన తదుపరి చిత్రంతో హీరోగా మరోసారి 'ఖలేజా" చూపించాలని తపిస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం రెండు రోజుల క్రితమే పుణెలో పతాక సన్నవేశాల చిత్రీకరణ పూర్తి చేసుకుంది. నిజంగానే ఈ సినిమా గురించి ఎక్సయిట్ అవుతున్నాడో లేక హైప్ పెంచడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాడో కానీ ఎప్పుడూ లేనిది తన సినిమా గురించి కాసింత ఎక్కువే మాట్లాడుతున్నాడు మహేష్.

అభిమానులతో ట్విట్టర్లో టచ్ లో ఉంటూ సినిమా విశేషాలను తెలుపుతున్నాడు. ఈ సినిమా అనుకున్న దానికికంటే చాలా బాగా వచ్చిందని ఖచ్చితంగా మళ్లీ రికార్డులను తిరగరాస్తుందని కూడా తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. అయితే ఇప్పుడు రికార్డు అంటే మగధీర నే కనుక మహేష్ వాటిని కొట్టాలని ఆశపడుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. అయితే మరి కొందరు రికార్డులని అనుకోకుండా సాధించాలే కానీ టార్గెట్ గా పెట్టుకుంటే అంతే సంగతులు అంటున్నారు.

ఇదిలా వుంటే అరుంధతి సినిమా ద్వారా అనుష్కకు వచ్చిన ఇమేజ్ అంతా అనుష్క హీరోయిన్ గా నటించిన 'వేదం", 'పంచాక్షరి' సినిమాలు పోగొట్టాయని విశ్లేషకులు అంటున్నారు. ఈ రెండు సినిమాల్లోనూ అనుష్క పాత్రలను సరిగ్గా దర్శకులు చేయలేకపోయారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయంలో అనుష్క అభిమానులు కూడా చాలా నిరుత్సాహంగా ఉన్నారట. దాంతో అనుష్క దృష్టి అంతా తదుపరి తన సినిమా 'కలేజా" పైనే పెట్టిందని సమాచారమ్. ఈ సినిమా తనకు మంచి పేరు తెచ్చి పెడుతుందని అనుష్క భావిస్తోందట. మరి మహేష్ ఏ మేరకు రికార్డులను బద్దలు కొట్టి అనుష్కకు కాపాడతాడో వేచి చూడాల్సిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu