»   » మొదటి సారి కదా... మహేష్ కూతురు మురిసిపోయింది (ఫోటో)

మొదటి సారి కదా... మహేష్ కూతురు మురిసిపోయింది (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు గారాల కూతురు, లిటిల్ ప్రిన్సెస్ సితార.... తొలిసారిగా చేతులకు మెహందీ (గోరంటాకు) పెట్టుకుంది. ఆడ పిల్లలకు మెహందీ పెట్టుకోవడం అంటే ఎంతో సరదా. తొలిసారిగా మెహందీ ఎక్స్‌పీరియన్స్ అనంతరం సితార సితార ఆనందంతో మురిసిపోయింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను నమ్రత సోసల్ మీడియా ద్వారా షేర్ చేసింది.

మహేష్ బాబు తనయుడు గౌతం కృష్ణ ఇప్పటికే ‘1 నేనొక్కడినే' సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయిన సంగతి తెలిసిందే. తొలి సినిమాలో గౌతం తన యాక్టింగ్ స్కిల్స్ తో ఆకట్టుకున్నాడు. 9 ఏళ్ల వయసులో అబ్బుర పరిచే నటన కనబర్చిన గౌతం మా టీవీ అవార్డు కూడా అందుకున్నాడు.

Mahesh Babu Daughter's first Mehendi

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు కూతురు ‘సితార' కూడా త్వరలో వెండి తెరకు పరిచయం కాబోతున్నట్లు సమాచారం. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం'లో సితార ఓ చిన్న పాత్రలో కనిపించనుందట. మహేష్ బాబు కూడా చిన్న వయసులోనే తన తండ్రి నటించిన చిత్రాల్లో నటిస్తూ వెండి తెరకు పరిచయం అయిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం సితార వయసు కేవలం 4 సంవత్సరాలు మాతమే. ఇటీవల మాటీవీ అవార్డుల పంక్షన్లో తన ఫ్యామిలీతో కలిసి హాజరై అందరినీ ఆకట్టుకుంది. బ్రహ్మోత్సవం సినిమా ద్వారా సితారను వెండి తెరపై చూడటం అంటే అభిమానులకు పండగ అనే చెప్పాలి. అయితే సితార నటించే విషయం ఇంకా అఫీషియల్ గా ఖరారు కాలేదు. త్వరలో ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

English summary
Mahesh's Daughter Sitara is said to be getting her first mehendi on her hands. The adorable picture was shared by Mahesh wife Namrata and it was liked by many of Prince fans.
Please Wait while comments are loading...