»   »  మహేష్ కూతురు చెప్పిన డైలాగ్... ఎంత క్యూట్ గా చెప్పిందో (వీడియో)

మహేష్ కూతురు చెప్పిన డైలాగ్... ఎంత క్యూట్ గా చెప్పిందో (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కు తన ఫ్యామిలీ అంటే ఎంతో ప్రేమ. మహేష్ బాబు కు ఒక కొడుకు ఒక కూతురు ఉంది. మహేష్ బాబు కు కూతురు సితార అంటే చాల ఎక్కువ ప్రేమ చూపిస్తాడు. సితార ఏం చేసినా మహేష్ దంపతులకి అదో వింతే... నమ్రత అయితే తన కూతురు చేసిన ప్రతీ పనికీ ఎబంతో మురిసిపోతుంది... వెంటనే మహేష్ ఫ్యాన్స్ కి కూడా సోషల్ మీడియా ద్వారా చూపించి ఆ ఆనందన్ని పంచుకుంటుంది కూడా...

సితార ఆ మధ్య ఓ ఆడియో ఫంక్ష‌న్ లో డ్యాన్స్ చేసి ఆక‌ట్టుకుంది. ఆత‌ర్వాత మ‌హేష్ బాబు న‌టించిన ఓ పాట‌కు సితార డ్యాన్స్ చేసిన వీడియో సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నం సృష్టించింది. ఇక ఇప్పుడు సితార‌ షెఫ్ గెట‌ప్ లో త‌న చిన్ని చిన్ని చేతుల‌తో చాక్లెట్ త‌యారు చేసింది. దానికే మహేష్ అభిమానులు ఒక రెంజ్ లో ఆ పిక్స్ ని షేర్ చేసుకొని కేరింతలు కొట్టారు. ఇప్పుడు సితార తన తండ్రి సినిమాలోని ఓ డైలాగ్ ను ముద్దు ముద్దుగా పలికింది. మహేష్ 'బ్రహ్మోత్సవం' సినిమాలో సమంత చెప్పిన డైలాగ్ ను సితార తన ముద్దు ముద్దు మాటలతో చెప్పింది.

 Mahesh Babu

"ఏడుతరాల ?...వెతికితే దొరకనంతమందా?...కలుస్తే వదులుకోలేనంతమందా?" అన్న డైలాగును క్యుట్ అండ్ స్వీట్ గా చెప్పేసింది సితార. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మీరు కూడా ఈ సితారమ్మగారి ఆరిందా డైలాగ్ వినండి మరి...

This one is for u Sam!! Enjoy 😊

A video posted by Namrata Shirodkar (@namratashirodkar) on Oct 27, 2016 at 7:49am PDT

English summary
Prince Mahesh Babu Daughter Sitara Says Samantha Dialogue from Brahmotsavam Movie now viral on social meadia
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu