»   » విడుదల దిశగా దూసుకెలుతున్నమహేష్ ‘దూకుడు’..!

విడుదల దిశగా దూసుకెలుతున్నమహేష్ ‘దూకుడు’..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వస్తున్న 'దూకుడు' సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరణలో యూనిట్ తలమునకలై ఉంది. కార్మికులు సమ్మె సడలించగానే హైదరాబాద్ శివార్లు లోని అల్యూమినియం ఫాక్టరీ లో కొంతభాగం చిత్రీకరించి తాజాగా చార్మినార్ పరిసర ప్రాంతాలలో చిత్రీకరణ జరుపుతున్నారు.

ఆ తరవాత ఒక పాటను పద్మాలయా స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో చిత్రీకరించనున్నారు. దాంతో పాటలు, కొంత టాకీ పార్ట్ మినహా సినిమా పూర్తవుతుందని సమాచారం. మిగిలిన షూటింగును మే నెలలో స్విట్జర్లాండ్ లో చిత్రికరించటానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. శరవేగంగా షూటింగ్ పనులు పూర్తిచేసి ఈ చిత్రాన్ని జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది దర్శక నిర్మాతల ప్రయత్నం.

సమంత మహేష్ తో జోడి కడుతున్న ఈ చిత్రాన్ని కృష్ణ ప్రొడక్షన్ బ్యానర్ సమర్పణలో 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంఫై అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

English summary
Dookudu with Super Star Mahesh Babu in the lead role directed by Srinu Vytla is being shot at Charminar in Hyderabad. Buzz is that action sequences are being shot as of now.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu